వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోపంతో మాట్లాడా, నా ప్రవర్తన ఇబ్బంది పెడితే..: లేఖలో రోజా, మీది తప్పే!: సుప్రీం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు తన సస్పెన్షన్ పైన వివరణ ఇస్తూ సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. గురువారం నాడు రోజా సస్పెన్షన్ పైన ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదనలు జరిగాయి. అనంతరం విచారణ ఈ రోజుకు వాయిదా పడింది.

శుక్రవారం కూడా పావుగంట సేపు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా రోజా సస్పెన్షన్ పైన వివరణ ఇస్తూ ధర్మాసనానికి లేఖ రాసింది. తన లేఖను పరిగణలోకి తీసుకోవాలని, తనను అసెంబ్లీలోకి వెళ్లేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు.

దానికి సుప్రీం కోర్టు నో చెప్పింది. సభలోకి అనుమతి విషయంలో శాసన సభనే సుప్రీం అని చెప్పింది. సస్పెన్షన్ పైన తుది నిర్ణయం కూడా సభదేనని చెప్పింది. కావాలంటే మీరు మీ పిటిషన్ విత్ డ్రా చేసుకోవచ్చునని సూచించింది. అనుచిత వ్యాఖ్యలు మాత్రం సరికాదని సుప్రీం మరోసారి తెలిపింది. సభలోకి అనుమతి విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం అని చెప్పింది.

Roja gives letter to Supreme Court

తమను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించడం లేదని రోజా తరఫు లాయర్ చెప్పారు.

దానికి ప్రభుత్వ తరఫు న్యాయవాది మాట్లాడుతూ... అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చేందుకు అనుమతిస్తామని చెప్పారు. దీనిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ... అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తామని చెబుతున్నారని, ఇక ఆందోళన అవసరం లేదని, సభలోకి వెళ్లే విషయంలో మాత్రం సభనే సుప్రీం అని చెప్పారు. అనంతరం విచారణ ఆగస్ట్ మొదటి వారానికి వాయిదా పడింది.

రోజా తన లేఖలో... తాను అనిత పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, తన ప్రవర్తనతో సభ్యులకు ఇబ్బంది కలిగితే ఉపసంహరించుకుంటున్నానని రోజా పేర్కొన్నారు. తనకు టిడిపి ఎమ్మెల్యే అనితతో వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు. ఆమె పట్ల తాను అనుచితంగా ప్రవర్తించలేదన్నారు. ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదన్నారు.

ఒకవేళ అనిత పట్ల వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తే ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. తాను కావాలని, రెచ్చగొట్టాలని ఏ వ్యాఖ్యలు చేయలేదన్నారు.

తనను రెచ్చగొట్టారని, వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యానించారని, అందువల్లే బాధ, కోపంతో ఏమైనా మాట్లాడి ఉంటే వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. తాను ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించలేదన్నారు. ఇదే లేఖను స్పీకర్‌కు పంపించానని సుప్రీం కోర్టుకు రోజా తెలిపారు. సభను లేదా సభా నాయకుడిని అవమానించే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పారు.

English summary
YSRCP MLA Roja gives letter to Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X