'మాయాలేడీ రోజాతో జగన్ పోటీ, అఖిలప్రియపై జగన్‌కు పగ ఎందుకు'

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: వైసిపి అధినేత వైయస్ జగన్ మాటలలో ఎమ్మెల్యే రోజాతో పోటీ పడుతున్నారని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు ఎద్దేవా చేశారు. జగన్ అంటే వైసిపి నాయకులకే భయం పట్టుకుందన్నారు.

నంద్యాలలో టిడిపికి ఆందోళనలివే, జగన్ వస్తే మంచిదే! అఖిలప్రియకు ఆదేశాలు

రోజాలాంటి మాయా లేడీతోనా, ఓటేయకుంటే చంపుతానంటాడేమో

రోజాలాంటి మాయా లేడీతోనా, ఓటేయకుంటే చంపుతానంటాడేమో

జగన్ ఏం మాట్లాడుతారోనని వైసిపి నాయకులు భయాందోళనకు గురవుతున్నారని జూపూడి అన్నారు. జగన్ పోటీ పడితే చంద్రబాబు ఆలోచనలు, అభివృద్ధి కోసం పోటీ పడాలన్నారు. కానీ రోజాలాంటి మాయాలేడీతో పోటీ పడటం విడ్డూరమన్నారు. నాయకత్వ లేమి కారణంగానే ఎమ్మెల్యేలు వైసిపిని వీడారని చెప్పారు. ఓట్లు వేయకుంటే కాల్చి చంపుతానంటాడేమో అన్నారు.

జగన్ వైపు కాదు, ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నారు

జగన్ వైపు కాదు, ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నారు

ఇప్పుడు ప్రజలు ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నారని, జగన్ వైపు చూడలేదని జూపూడి అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడా అని వేచి చూస్తున్నారని చెప్పారు. వార్డుల్లో ప్రచారానికి వెళ్తే రోజాకు మహిళలు షాకిస్తున్నారని చెప్పారు. నంద్యాలలో 80 శాతం ఓట్లు మాకే అని చెప్పారు.

16-18 వరకు బాలకృష్ణ ప్రచారం

16-18 వరకు బాలకృష్ణ ప్రచారం

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి తరపున ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చే తేదీ ఖరారయింది. ఈ నెల 16 నుంచి 18 వరకు నంద్యాల పట్టణంతోపాటు గోస్పాడు, నంద్యాల మండలాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలయ్య పర్యటన పూర్తి కాగానే చంద్రబాబు ఈ నెల 19 నుంచి 21 వరకు నియోజకవర్గంలో పర్యటించే అవకాశముంది.

YSRCP MLA Roja Arrested by TDP Govt at National Women's Parliament - Oneindia Telugu
అఖిలప్రియపై జగన్‌కు అంత పగ ఎందుకు

అఖిలప్రియపై జగన్‌కు అంత పగ ఎందుకు

18 నెలల పదవి కోసం వైసిపి పోటీ పెట్టడం వారి అనైతికతకు నిదర్శనమని మమంత్రి కాల్వ శ్రీనివాసులు వేరుగా అన్నారు. భూమా అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డిల మీద జగన్‌కు ఎందుకంత పగనో అర్థం కావడం లేదన్నారు. మీ ఓటుతో బ్రహ్మానంద రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

రోజా మాట్లాడటమా?

రోజా మాట్లాడటమా?

భూమా అఖిలప్రియ వస్త్రధారణపై విమర్శలు చేస్తున్న రోజా, తాను జబర్దస్త్‌ కార్యక్రమంలో ఎలాంటి దుస్తులు ధరించి డ్యాన్స్‌ చేస్తుందో ఆత్మవిమర్శ చేసుకోవాలని మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader Jupudi Prabhaka Rao on Tuesday said that YSR Congress Party Nagari MLA is Maya lady. He said now, YSRCP people are seeing at Prashant Kishore, but not YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...