జగన్ మగాడిలా, బాబును చూసి 200 మంది పారిపోయారు, కాళ్లు పట్టేందుకు: రోజా

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుపతి: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మగాడిలా మీడియా సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారని, అదే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం అమెరికా పర్యటన నుంచి వచ్చాక ఏకంగా ఆరు గంటలకు కనిపించకుండా పోయారని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు.

300 మందిని కలుస్తానని

300 మందిని కలుస్తానని

ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. దోచుకున్న సొమ్ము దాచుకునేందుకే చంద్రబాబు విదేశీ పర్యటనలు అని ఆరోపించారు. అమెరికాలో తాను 300 మంది సీఈవోలను కలుస్తానని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.

200 మంది పారిపోయారు

200 మంది పారిపోయారు

కానీ కనీసం వంద మందిని కూడా కలవలేదన్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాల గురించి తెలిసి 200 మందికి పైగా సీఈవోలు పారిపోయారని రోజా ధ్వజమెత్తారు.

అమిత్ షా కాళ్లు పట్టేందుకు

అమిత్ షా కాళ్లు పట్టేందుకు

అమెరికా పర్యటన నుంచి వచ్చాక చంద్రబాబు ఢిల్లీలో ఆరు గంటలకు పైగా కనిపించకుండా ఎందుకు పోయారో చెప్పాలన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాళ్లు పట్టుకునేందుకు ఆయన కనిపించకుండా పోయారన్నారు.

మాటల యుద్ధం

మాటల యుద్ధం

కాగా, చంద్రబాబు అమెరికా పర్యటన అనంతరం ఢిల్లీలో పలువురు సీఈవోలను ఏపీలో పెట్టుబడుల నిమిత్తం ఓ హోటల్లో కలిసినట్లుగా వార్తలు వచ్చాయి. మరోవైపు, జగన్ ప్రధాని మోడీని కలవడాన్ని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి ఎదురు దాడి చేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP MLA Roja lashed out at AP CM Chandrababu Naidu for targetting YSRCP cheif YS Jagan over PM Modi meeting.
Please Wait while comments are loading...