మలుపు తిరుగుతున్న నగరి రాజకీయాలు- రంగంలో దిగిన రోజా

మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌రణను వ్య‌తిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన విజయవంతం కావడంతో మరో అడుగు ముందుకేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తోంది.

ఈ క్రమంలో కల్తీ మద్యంపై పోరాటాన్ని ఆరంభించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. టీడీపీ కూటమిప్రభుత్వ మద్యం విధానాల వెనుక ఉన్న వైఫల్యాలు, అవినీతి పట్ల ఉద్యమిస్తోన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని అన్ని ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ముందు భారీ నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారు.

Roja launched protest in Nagari

ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ఆర్కే రోజా భారీ ర్యాలీ చేపట్టారు. నగరి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వ‌ద్ద బైఠాయించారు. నారావారి సారా పాలన నశించాలంటూ నినాదాలు చేశారు. అంత‌క‌ముందు రోజా నివాసం నుంచి నగిరి ఎక్సైజ్ కార్యాలయం వరకు పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేప‌ట్టారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా రోజా మాట్లాడారు. మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్‌ జగన్‌ అయిదు సంవత్సరాల పాటు కాపాడారని గుర్తు చేశారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన 43,000కు పైగా బెల్ట్ షాపులను జగన్ ప్రభుత్వం వచ్చాక తొలగించారని అన్నారు. మద్యం దుకాణాలను మూసేశారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉందని రోజా ఆందోళన వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ నాయకుల మాత్రం అడ్డదిడ్డంగా ప్రజలను దోచుకుంటున్నారని, కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని రోజా మండిపడ్డారు. మొలకలచెరువులో టీడీపీ నియోజకవర్గం ఇన్ ఛార్జీకి చెందిన కల్తీ మద్యం తయారీనే దీనికి నిదర్శనమని అన్నారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడం అన్నట్లుగా తయారైందని, ఎన్డీఏ అంటే దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్ అని విమర్శంచారు.

పైస్థాయి నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కల్తీ మద్యాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు తుడిచేస్తోన్నారని, మంగళ సూత్రాలను మట్టిలో తొక్కేస్తోన్నారని విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించాలని, కల్తీ మద్యంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని రోజా డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+