జగన్ ఆగ్రహం, బాధపడ్డ రోజా: విశాఖ బహిరంగ సభకు డుమ్మా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను హెచ్చరించడంతో నగరి ఎమ్మెల్యే రోజా మనస్థాపానికి గురైనట్లుగా తెలుస్తోంది.
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను హెచ్చరించడంతో నగరి ఎమ్మెల్యే రోజా మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఆమెకు అధినేత క్లాస్ పీకినట్లుగా వార్తలు వచ్చినట్లుగా విషయం తెలిసిందే.
తాజాగా, ఆమె విశాఖలో జరిగిన సేవ్ విశాఖ బహిరంగ సభకు హాజరు కాలేదు. దీంతో జగన్ మందలించడంతో ఆమె బాధపడ్డారని, అందుకే బహిరంగ సభకు రాలేదనే ప్రచారం సాగుతోంది. రోజా డుమ్మ కొట్టడంపై చర్చ సాగుతోంది.

జగన్ వార్నింగ్ కారణంగానే రోజా విశాఖలో తలపెట్టిన మహాధర్నాకు హాజరు కాలేదని గుసగుసలాడుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తదితరులు హాజరయ్యారు. కానీ ఎప్పుడు జగన్ వెంట సభల్లో కనిపించే రోజా కనిపించకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications