నేను సభలో లేను, జగన్ ఒక్కడిని చూసి తూలనాడారు: రోజా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, సోమవారం అవిశ్వాస తీర్మానం సమయంలో తాను లేనని, తమ పార్టీ అధినేత జగన్ ఒక్కడిని చూసి తెలుగదేశం పార్టీ దారుణంగా మాట్లాడిందని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. తమది ప్రతిపక్షం కాబట్టి ఒకింత ఆవేశంగా మాట్లాడుతామన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నందున తన వాయిస్ వినిపించకుండా చేసేందుకు సస్పెండ్ చేశారన్నారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇలా జరిగి ఉండదన్నారు. సభలో నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ పార్లమెంటరీ పదాలు వాడారన్నారు.

మమ్మల్ని ఎదిరిస్తే తొక్కి పడేస్తామన్న పద్ధతిలో టిడిపి తీరు ఉందన్నారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్నారు. భవిష్యత్తులో రాజకీయాలు తప్పుదారి పట్టకుండా కోర్టులు సరిదిద్దాలన్నారు. అసెంబ్లీ అంటే ఎన్టీఆర్ భవన్‌లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రిగా ఉన్నారని, అందుకే నిలదీస్తున్నామన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యల పైన ఆవేశంగా మాట్లాడుతామని చెప్పారు. తన సస్పెన్షన్ పైన సుప్రీం కోర్టు చివాట్లు పెట్టిందని, రేపు విచారణ జరుగుతుందని, తనకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications