మగాళ్లకు తెలియకపోవచ్చు, అడ్రస్ లేకుండా పోయారు: బాబును తిట్టిపోసిన రోజా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారనడం దారుణమని, టిడిపిలో ఎవరూ చేరాలనుకోరన్నారు. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
ఈ రోజు కౌరవుల కంటే ఒకరు ఎక్కువగానే ఉన్నప్పటికీ, మీరు వైసిపికి చెందిన ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారంటూ ప్రచారం చేయించడం విడ్డూరమన్నారు. పచ్చ కామెర్ల వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తోందని, టిడిపికి లోకమంతా పచ్చగానే కనిపిస్తోందన్నారు.
హైదరాబాదులో అడ్రస్ లేకుండా పోయారు
ఇదిగో వచ్చేస్తున్నారని, అదిగో వచ్చేస్తున్నారని టిడిపి నిన్న చెప్పిందని, కానీ ఇప్పటి వరకు ఒక్కరు వైసిపిలో చేరలేదన్నారు. హైదరాబాదును నెంబర్ వన్ చేస్తానంటే అక్కడ జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక్క కార్పోరేటర్ గెలిచారన్నారు.

హైదరాబాదును నేనే అభివృద్ధి చేశానని చెప్పిన చంద్రబాబుకు అక్కడ పార్టీ లేకుండా పోయిందన్నారు. ఏపీ అభివృద్ధిని రెండు డిజిట్లకు తీసుకు వెళ్తానని చంద్రబాబు చెబుతున్నారని, అంటే భవిష్యత్తులో టిడిపికి ఏపీలో మిగిలేది ఇద్దరు ఎమ్మెల్య్లేనే అని అర్థమవుతోందన్నారు.
జగన్ కోసం లక్షలాది మంది ప్రాణత్యాగానికి సిద్ధం
జగన్ కోసం లక్షలాది మంది దేనికైనా సిద్ధంగా ఉన్నారని, ఆయన కోసం లక్షలాది మంది ప్రాణం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అలాంటిది చంద్రబాబు కోసం ఒక్కరైనా ప్రాణం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. టిడిపిలోకి రాక్షస సంతతిలో పుట్టిన వారయితేనే వస్తారన్నారు.
హామీలు ఇచ్చి మోసం... టిడిపి మునిగే నావ
రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను, ఉద్యోగాల పేరుతో విద్యార్థులను... ఇలా అందర్నీ మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. టిడిపి మునిగిపోయే పడవ అని, అందులో ఎవరైనా చేరితే ఆ బరువుకు మరింత తొందరగా మునుగుతుందన్నారు.
వైసిపి ఎమ్మెల్యేలను ఎలాగైనా లాక్కోవాలని చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నారన్నారు. అందుకే జన్మభూమి కమిటీలో ఓడిపోయిన వారిని, రౌడీలను వేశారని దుయ్యబట్టారు. తద్వారా ప్రజాప్రతినిధులను తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చూశారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఓడిపోయిన వారికి, త్రిసభ్య కమిటీలకు, టిటిడి బోర్డు సభ్యులకు ఇచ్చి ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేశారన్నారు.
వైసిపి ఎమ్మెల్యేల పైన తప్పుడు కేసులు పెట్టారని, తనను అయితే ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారన్నారు. నయానో, భయానో, కేసులు పెట్టి చంద్రబాబు తన పార్టీలోకి వైసిపి ఎమ్మెల్యేలను చేర్చుకుందామని భావిస్తున్నారన్నారు.
చంద్రబాబు వద్దకు ఒక్క ఎమ్మెల్యే వెళ్లలేదు
ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే చంద్రబాబు వద్దకు తమ ఎమ్మెల్యేలు వెళ్లలేదంటే ఆయన ఏమిటో తెలుస్తోందని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలో లేనప్పటికీ ఆయనకు చాలామంది మద్దతుగా నిలబడ్డారన్నారు. పరిపాలనలో టిడిపి సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.
జగన్ ఉదయించే సూర్యుడు, బాబు అస్తమించే సూర్యుడు
అధికారమే పరమావధిగా కాకుండా.. ప్రజల కోసం జగన్ ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు అస్తమించే సూర్యుడని, జగన్ మాత్రం ఉదయించే సూర్యుడన్నారు. చంద్రబాబు పాత టైప్ రైటర్ అని, జగన్ కంట్రీ యాపిల్ కంప్యూటర్ లాంటి వాడన్నారు.
చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానంతో ముందుకు వెళ్తున్నారని, ఆయన వెంట వెళ్లాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. పాత్రికేయులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని.. ఓ వర్గం మీడియా టిడిపి వండిన వార్తలను వేస్తోందని, ఇది సరికాదన్నారు. లేని దానిని రాస్తే తాము చట్టపరంగా మీడియా పైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఏం చూసి టిడిపిలో తమ పార్టీ ఎమ్మెల్యేలు చేరుతారని ప్రశ్నించారు. టిడిపి పాలన పల్లకీ ఏం కాదని, రెండేళ్ల తర్వాత చంద్రబాబు పాలన పాడే అని తెలుస్తుందన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా జగన్ వెంటే ఉన్నారని చెప్పారు. అవినీతి, వంచన, విశ్వాసఘాతుకం, వెన్నుపోటుకు పెట్టిన పేరైన నీ పార్టీలోకి ఎవరు వస్తారన్నారు.
తన సస్పెన్షన్ పైన తాను హైకోర్టుకు వెళ్లానని చెప్పారు. ఓ ఎమ్మెల్యేగా తన హక్కులను కాలరాస్తున్నందుకు తాను హైకోర్టును ఆశ్రయించానన్నారు. కోర్టులో తనకు న్యాయం జరుగుతుందన్నారు. అలాగే స్పీకర్‌కు కూడా మరో లేఖ ఇస్తానని చెప్పారు. తనను ఆవేశంలో సస్పెండ్ చేసి ఉంటారని, తర్వాత చర్చ జరిపి తన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తారని భావించానని కానీ అది జరగలేదన్నారు.
అసెంబ్లీలో తనకు సంబంధించిన వీడియోలు అంటూ కొన్ని బయట పెట్టారని, మగవాళ్లకు అంతగా తెలియదని, కానీ ఆ వీడియోల్లో మూడ నాలుగు చీరలు ఉంటాయని, దానిని బట్టే అది కల్పితమని తెలుస్తోందన్నారు. పాలనలో విఫలమైన చంద్రబాబు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారన్నారు.
అయినా దానిని ఎవరు రికార్డ్ చేశారో తెలియాలని, దానిని సెల్ ఫోన్లో రికార్డ్ చేశారా, మరే విధంగానైనా రికార్డ్ చేశారా తెలియాల్సి ఉందన్నారు. రికార్డు చేసిన వాడిని శిక్షించాలన్నారు. ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలన్నారు. టిడిపి చీఫ్ ట్రిక్స్‌కు బుద్ధి చెప్పే విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను పోలీస్ స్టేషన్లోను ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
అసెంబ్లీ సెక్రటరీ టిడిపి కార్యకర్తలా పని చేస్తున్నారని, ఆయన పైన చర్యలు తీసుకోకుంటే తాము ప్రిన్సిపల్ సెక్రటరీ, గవర్నర్‌లకు ఫిర్యాదు చేస్తామని రోజా అన్నారు.
ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం: రక్షణనిధి
తాను పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వైసిపి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి మండిపడ్డారు. టిడిపిలో చేరాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి సీఎం, మంత్రులను కలిసినట్లు చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ వెంటే ఉంటానని చెప్పారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications