పార్టీ వీడుతారని పుకార్లు: వివరణ ఇచ్చిన రోజా

ఇటీవల కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో తాను పార్టీని వీడుతున్నట్లు గాలి వార్తలు వచ్చాయని, పదవుల కోసం పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. పుత్తూరు పట్టణంలోని పిఆర్ అతిథి గృహంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో స్థానం కల్పించిన వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే కడవరకూ ఉంటానని ఆమె స్పష్టం చేశారు. నగరి అసెంబ్లీ స్థానం నుంచి తనను ఓడించడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆమె అన్నారు.
తన గెలుపు కోసం కృషి చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు. అభివృద్ధిపరమైన అంశాలకు సంబంధించిన నిధులు ఆపడానికి వీలుండదని, ఆ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో తాను వెనకాడే ప్రసక్తి లేదని రోజా చెప్పారు.












Click it and Unblock the Notifications