తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల్లా మేం చేయట్లేదు: రోజా

హైదరాబాద్: తాము తెలంగాణ శాసన సభలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు ప్రవర్తించినట్లుగా వ్యవహరించడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు రోజా మంగళవారం మండిపడ్డారు. డ్వాక్రా రుణాల అంశంపై తమను మాట్లాడనివ్వడం లేదని వైసీపీ శాసన సభ నుండి వాకౌట్ చేసింది. అనంతరం రోజా మాట్లాడారు.

డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలు మోసం చేశారన్నారు. రుణాలు కట్టవద్దని ఎన్నికల ప్రచార సమయంలో చెప్పి చంద్రబాబు మహిళలను తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. సమస్యల పైన చర్చించేందుకు ప్రభుత్వం భయపడుతోందన్నారు.

 Roja says they are not behave like Telangana TDP MLAs

ఎన్నికల హామీలు అమలు చేయడంలో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చేసినట్లు తాము చేయడం లేదన్నారు. ప్రజా సమస్యల పైన చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదని ప్రశ్నించారు. డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు.

అంతకుముందు సభలో జగన్ మాట్లాడుతూ.. తమకు సభలో అయదు నిమిషాల సమయం కేటాయిస్తే తప్పా అని నిలదీశారు. అయిదు నిమిషాల సమయం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేరని ఆరోపించారు. ఇది కౌరవ సభ అని చెప్పడానికి వేరే కారణాలు కనిపించడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+