ఢిల్లీని వణికించాం, మూడేళ్ల తర్వాత 30 ఏళ్లు పాలిస్తాం: రోజా

హైదరాబాద్: తమ పార్టీ ఢిల్లీ పీఠాన్నే వణికించిందని, మూడేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 30 ఏళ్ల పాలిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని ఆమె అన్నారు.

పార్టీ ఆరో ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా హైదరాబాదులోని ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం జెండాను ఆవిష్కరించిన తర్వాత ఆమె మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల పునాదిపై ఆరంభమైన తమ పార్టీ ఐదేళ్లు పూర్తి చేసుకుందని ఆమె చెప్పారు.

రాజన్న పాలనను అందించేందుకు ముందుకు వచ్చిన పార్టీ ఇది అని, ఇలాంటి పార్టీలో కార్తకర్తగానూ ఎమ్మెల్యేగానూు ఉండడాన్ని గర్వంగా భావిస్తున్నామని ఆమె చెప్పారు. దేశ రాజకీయాల్లోనే ఈ పార్టీకి అరుదైన చరిత్ర ఉందని, పార్టీ పెట్టిన వెంటనే ఉప ఎన్నికలకు వెళ్లి కనీ వినీ ఎరుగని మెజారిటీ సాధించి తెలుగోడి సత్తాతో ఢిల్లీ పీఠాన్ని కదిలించిందని రోజా చెప్పారు.

తమ నాయకుడు జగన్ నాయకత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని, తమ నాయకుడు ఓటుకు కోట్లిచ్చిన అవినీతిపరుడు కాడని, తోడేళ్లలాంటి టిడిపి వాళ్లు ఎంత బురద చల్లినా, తొడ గొట్టి పోరాడుతున్న యోథుడు జగన్మోహన్ రెడ్డి అని ఆమె ప్రశంసించారు.

Roja says YCP will come into the power in AP

ఆత్మహత్యలే ఉంటాయి....

రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని ఆయన అన్నారు. కొన్ని పనులు దైవికంగానే, మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని మేకపాటి అన్నారు.

ఎపిలో ఇప్పుడున్న పరిస్థితులు, ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు హేయమైన భావాలను కలిగిస్తున్నాయని అన్నారు. మహత్తరమైన కార్యక్రమం అంటూనే దాంటట్లో కూడా సొంత లాభం చూసుకుంటున్నారని, కాకపోతే ఈ విషయంలో మనం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.

చంద్రబాబు తాను చేస్తున్న కార్యక్రమాల గురించి పైకి చాలా గొప్పగా చెబుకుంటారని, ఆయనను చూసే ప్రపంచమంతా క్యారెక్టర్ నేర్చుకోవాలన్నట్లు ఉంటాయని, నీతివాక్యాలు చెబుతారు గానీ ఆచరణకు మాత్రం దూరంగా ఉంటారని మేకపాటి దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+