రోజా క్షమాపణ చెప్పి తీరాల్సిందే.. మొండికిపోతే చర్యలు తప్పవు:యనమల

రోజాపై సస్పెన్షన్ గడువు ముగిసినందునే.. ఆమె అసెంబ్లీ ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోవడం లేదని ఆయన అన్నారు. అయితే సభలో టీడీపీ ఎమ్మెల్యే అనితకు రోజా బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు.

అమరావతి: అనుచిత వ్యాఖ్యల పేరుతో ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెన్షన్ ఎదుర్కొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా.. తాజా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. రోజా సభలో అడుగుపెట్టడం పట్ల ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినప్పటకీ.. అప్పటి వివాదానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అనితకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో నేటి ఉదయం అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ రోజా విషయంపై స్పందించారు. రోజాపై సస్పెన్షన్ గడువు ముగిసినందునే.. ఆమె అసెంబ్లీ ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోవడం లేదని ఆయన అన్నారు. అయితే సభలో టీడీపీ ఎమ్మెల్యే అనితకు రోజా బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు.

Roja should apologise to MLA anita says Yanamala Rama krishnudu

అనితపై రోజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సభా హక్కుల కమిటీ నివేదిక రూపొందించిందని యనమల అన్నారు. బేషరతు క్షమాపణకు రోజా తిరస్కరించిన పక్షంలో ఆమెపై తుది నిర్ణయం తీసుకునే హక్కును సభాపతికే వదిలివేయనున్నట్లు తెలిపారు. క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తప్పవని, అయితే ఆ చర్యలు ఏంటన్నది సభనే నిర్ణయిస్తుందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+