"రోజా ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి.. అక్కడ అందరూ సమానమే"

Subscribe to Oneindia Telugu

తిరుమల: వైసీపీ ఎమ్మెల్యే రోజా అతి చేస్తున్నారని, ఇకనైనా ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. అనుచరులతో తిరుమలకు వెళ్లిన రోజా ఎల్-1 టికెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారని, దేవుడి ముందు అందరూ సమానమేనన్న సంగతి తెలుసుకోవాలని చెప్పారు.

జేఈవో శ్రీనివాసరాజు ప్రభుత్వానికి సూట్‌కేసులు అందిస్తున్నారని, అందుకే ఆయన ఏడేళ్లుగా ఆ పదవిలో ఉన్నారని తిరుమలను సందర్శించిన సందర్భంగా రోజా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కూడా రాజేంద్రప్రసాద్ స్పందించారు.

  సినిమాల్లో నటించి నిజాయితీగా డబ్బు సంపాదించా : రోజా

  నేను అడిగితే ఇవ్వరా: తిరుమలలో రోజా సంచలన వ్యాఖ్యలు, బైక్‌లపై అనుచరుల హడావుడి

  roja should reduce her over action says mlc rajendra prasad

  అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఎస్వీబీసీలో అక్రమాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, దీనిపై టీటీడీ అధికారులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉందన్నారు. ఈవో సింఘాల్‌ గట్టి చర్యలు తీసుకుంటున్నారని రాజేంద్రప్రసాద్‌ చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TDP MLC Rajendra Prasad criticised YSRCP MLA Roja over her arguement with TTD officials.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి