జగన్ జైలుకెందుకెళ్లారో చెప్పిన రోజా, నోటికొచ్చినట్లు వద్దు.. టిడిపి
ఇప్పటికైనా ఆమె బాధ్యతాయుతంగా మాట్లాడాలని వర్ల హితవు పలికారు. ఇష్టానుసారం మాట్లాడితే తెదేపా మహిళా ప్రజాప్రతినిధుల చేతిలోనూ ఆమెకు పరాభవం తప్పదన్నారు.
అమరావతి: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా ఎదిరించినందునే జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, సీఎం చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నారని వైసిపి నేత రోజా విమర్శించారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వైసిపి ప్లీనరీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నవ నిర్మాణ దీక్ష పేరిట చంద్రబాబు నయవంచనకు పాల్పడుతున్నారన్నారు. అందుకే ప్రజలు దీక్షకు రాలేదన్నారు.

అదో నయవంచన
చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని, నవనిర్మాణ దీక్ష పేరిట ప్రజలను మళ్లీ నయవంచన చేస్తున్నారని రోజా మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలపై టిడిపి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు.

రోజా నోటికొచ్చినట్లు మాట్లాడుతావా
కాగా, ఏడాదిపాటు అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు గురైన రోజా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆమె తీరు ఇలాగే కొనసాగితే పరాభవం తప్పదని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య అన్నారు.

లోకేష్ గురించి అలా అంటారా
నారా లోకేశ్ దొడ్దిదారిన శాసనమండలికి వచ్చారని రోజా వ్యాఖ్యానించారని, కౌన్సిల్ రాజ్యాంగబద్ధ వ్యవస్థ అనే విషయాన్ని ఆమె తెలుసుకోవాలని హితవు పలికారు.

పదేపదే మాట్లాడుతారా
కృష్ణా జిల్లా తిరువూరులో శనివారం ఆయన మాట్లాడారు. ఏపీ శాసనమండలి స్థాయిని తగ్గించే విధంగా రోజా పదేపదే మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications