బాబు చొక్కాపట్టి నిలదీయాలి: రోజా, అరెస్ట్‌పై హెచ్చార్సీకి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును చొక్కా పట్టుకొని నిలదీయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు రోజా సోమవారం అన్నారు. టిడిపి నేత పయ్యావుల కేశవ్ విభజన పైన సుప్రీం కోర్టును ఆశ్రయించడంపై ఆమె స్పందించారు.
పయ్యావుల సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం కాదని, చంద్రబాబు చొక్కా పట్టుకొని నిలదీయాలని సలహా ఇచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చంద్రబాబు నాయుడులు మంత్రుల బృందానికి(జివోఎం)కు లేఖలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.

బాబు, కిరణ్‌లకు సొంత జిల్లా ప్రజల కష్టాలు కూడా తెలియవా అని ప్రశ్నించారు. ముగ్గురు నేతలు గాంధీగారి మూడు కోతుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలుగు వారికి వెన్నుపోటు పొడిచేందుకు బాబు అన్న ఐతే కిరణ్ తమ్ముడిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆడమన్నట్లు చంద్రబాబు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
విజయమ్మ అరెస్ట్ పైన హెచ్చార్సీకి
నల్గొండ జిల్లాలో ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అరెస్టు అప్రజాస్వామికమంటూ ఆ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు హెచ్చార్సీని ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన హెచ్చార్సీ ఈ నెల 21న నివేదిక ఇవ్వాలని డిజిపిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications