ప్రచారం చేసుకున్నావుగా: పవన్ కళ్యాణ్‌ను దులిపిన రోజా, స్త్రీల పట్ల ఆ మంత్రి అసభ్యంగా

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి రాగానే గజినిలా అంతా మరిచిపోయారని వైసిపి ఎమ్మెల్యే రోజా సోమవారం విమర్శించారు.

బ్రహ్మానందరెడ్డి గెలుపుపై భార్య: నీకేం అవసరం.. శిల్పాపై అఖిలప్రియ

కాటన్ రాయుడు మాట్లాడడేం?

కాటన్ రాయుడు మాట్లాడడేం?

చేనేత సమస్యలపై జనసేన అధినేత, కాటన్ రాయుడు పవన్ కళ్యాణ్ స్పందించడేమిటని రోజా ప్రశ్నించారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి కూడా ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. చంద్రబాబు ఏ జిల్లాలో చేనేత పార్కులు ఏర్పాటు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

Pawan Kalyan Fans Trolls MLA Roja
ప్రచారం చేసుకున్నాడుగా

ప్రచారం చేసుకున్నాడుగా

కాటమరాయుడు సినిమా విడుదల సమయంలో తాను కాటన్ రాయుడును అంటూ పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ చేసుకున్నారని రోజా ధ్వజమెత్తారు. కానీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉంటున్నారన్నారు. జగన్ మాటిస్తే వైయస్ రాజశేఖర రెడ్డి మాటిచ్చినట్లేనని, మాట తప్పరు, మడమ తిప్పరు అన్నారు. వైసిపి అధికారంలోకి రాగానే చేనేత సమస్యలను పరిష్కరిస్తారన్నారు.

మహిళల పట్ల ఉత్తరాంధ్ర మంత్రి అసభ్య ప్రవర్తన

మహిళల పట్ల ఉత్తరాంధ్ర మంత్రి అసభ్య ప్రవర్తన

చంద్రబాబు మంత్రులు అందరూ కంత్రీలు, ఎమ్మెల్యేలు అందరూ కాలకేయుళ్లేనని రోజా అన్నారు. మహిళా సాధికారత పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే... రిషికేశ్వరి మరణానికి కారకులు ఎవరు? ఉత్తరాంధ్ర మంత్రి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఆ మంత్రిని చంద్రబాబు తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

కనకదుర్గమ్మ సాక్షిగా ప్రతిజ్ఞ

కనకదుర్గమ్మ సాక్షిగా ప్రతిజ్ఞ

టిడిపి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని మహిళలు కనకదుర్గమ్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేయాలని రోజా అన్నారు. మైనార్టీ మహిళలకు కూడాటిడిపిలో విలువ లేదన్నారు. టిడిపి నేతలకు రాఖీ శుభాకాంక్షలు చెప్పే అర్హత లేదన్నారు.

కాళికాదేవిలా తిరగబడాలి

కాళికాదేవిలా తిరగబడాలి

చంద్రబాబు సిఎంగా ఉంటే మహిళలు బతకలేని పరిస్థితి అని రోజా అన్నారు. ఆయన మహిళా వ్యతిరేకి అన్నారు. మహిషాసురుని మర్ధించే కాళికాదేవిలా మహిళలు తిరగబడాలన్నారు. ఏపీలో మహిళల ప్రాణ, ధన, మాన రక్షణకు భద్రత లేదన్నారు. దేశంలో నలుగురు మంత్రులపై ఆరోపణలు ఉంటే, అందులో ఇద్దరు ఏపీ వారే అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party Nagari MLA Roja lashed out at Jana Sena Party chief Pawan Kalyan and Uttarandhra Minister.
Please Wait while comments are loading...