పవన్ కల్యాణ్ కుమారుడి ప్రమాదంపై మాజీ మంత్రి రోజా సంచలన పోస్ట్..!!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే, ఆయన తన పర్యటనను ముగించుకుని సింగపూర్ బయలుదేరనున్నారు.

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నాయకురాలు ఆర్కే రోజా స్పందించారు. ట్విట్టర్ ద్వారా రోజా రియాక్ట్ అయ్యారు.పవన్ కల్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

Roja s sensational post on Pawan Kalyan s son s accident

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం జరగడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. మంత్రి నారా లోకేష్ సైతం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ వెంటనే కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ సైతం స్పందించారు. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్‌కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఆయన త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ జగన్ ట్విట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+