సంక్రాంతి ఎఫెక్ట్: ఓఎల్ఎక్స్‌లో ‘కాకి’, ధరెంతో తెలుసా?
ఓఎల్ఎక్స్‌లో ‘కాకి’ని కూడా అమ్ముతున్నారు. అయితే దాని ధర కూడా ఆశ్చర్యం చేసే విధంగానే ఉంది.
పశ్చిమగోదావరి: ఓఎల్ఎక్స్‌లో కొత్తవి, వాడిన వస్తువులను కొనడం, అమ్మడం చేస్తుంటాం. ఇందులో పలువురు ఆశ్చర్యానికి గురిచేసే వస్తువులను కూడా అమ్ముతుంటారు. ఇప్పుడు ఏకంగా ఓఎల్ఎక్స్‌లో 'కాకి'ని కూడా అమ్ముతున్నారు. అయితే దాని ధర కూడా ఆశ్చర్యం చేసే విధంగానే ఉంది.
దాని ధర ఎంతంటే.. అక్షరాల రూ.12 వేలు మాత్రమే. ఇంతకీ ఆ 'కాకి'వివరాల్లోకి వెళితే.. అదో కోడి పుంజు రకం. దాని ధరను.. ఇన్నాళ్లూ పందెంరాయుళ్లు కోడిపుంజుల పెంపకందారుల వద్దకు వెళ్లి చూసుకుని బేరం ఆడే వారు. నచ్చితేనే కొనేవారు. లేదంటే లేదు.

అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో పుంజులకు మంచి డిమాండ్ వచ్చింది. దీంతో 'ఓఎల్‌ఎక్స్' రంగంలోకి దిగింది. ఆన్‌లైన్‌లో రకరకాల పుంజులను ఉంచారు. రంగుకు ఉన్న డిమాండ్‌ను బట్టి ధర పెట్టారు. కోడి పర్లా రూ. 3 వేలు ధర నిర్ణయించగా కేతువా రూ. 60 వేలు పలుకుతోంది. మైలా రూ.10వేలు, సవలా రూ. 15 వేలు, కాకిడేగ పర్లా రూ. 20 వేలు వరకు ఉన్నాయి.
కాగా, కోడి పుంజులను నెట్‌లో ఉంచి ధర నిర్ణయిస్తున్నారు. కొనుగోలు చేసే వారు పుంజు గల వ్యక్తి సెల్‌ఫోన్ నెంబరు ఆధారంగా అతని వద్దకు వెళ్తున్నారు. నచ్చితే పుంజును కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల తణుకు ప్రాంతానికి చెందిన బి శ్రీను ఆన్‌లైన్‌లో ఈ విధంగా పుంజును కొనుగోలు చేశాడు. పందేలకు అనే కాకుండా పెంపకానికి కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇలా సంక్రాంతి ఓఎల్ఎక్స్‌కు మరింత ప్రాచూర్యం తెచ్చిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications