రైల్వే చరిత్రలోనే తొలిసారిగా..

భారత రైల్వేశాఖ తన ట్వీట్ లో రోస్లిన్ అరోకియా మేరీ సాధించిన విజయాన్ని ప్రస్తావించింది. టికెట్ లేకుండా ప్రయాణం చేసేవారి నుంచి రూ.1.03 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. కోటిరూపాయలకు పైగా వసూలు చేసిన తొలి మహిళా టీసీ అంటూ ప్రశంసలు కురిపించింది. దక్షిణ రైల్వేలో ప్రిన్సిపల్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా ఆమె నియమితులయ్యారు.

రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. మహిళా టీసీకి అభినందనలు తెలిపింది. అరోకియా తన విధులను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్‌లో రాసింది. ఈ ట్వీట్ కు 1000కిపైగా లైక్స్ వచ్చాయి. 450 మంది రీట్వీట్ చేశారు. పనిపట్ల రోస్లిన్ నిబద్ధతకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

Roslyn Arokia Marie have been collected rs.1.03 crore from ticketless passengers

సీనియర్ టికెట్ ఎగ్జామినర్ శక్తివేల్ రూ.1.01 వసూలుచేసినట్టు దక్షిణ రైల్వే తెలిపింది. జరిమానాల విధించి అధిక మొత్తం వసూలు చేసిన దక్షిణ రైల్వే ఉద్యోగులను రైల్వే మంత్రిత్వశాఖ అభినందిస్తూ వారి ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. టిక్కెట్టు లేకుండా ప్రయాణించే వారి వల్ల రైల్వేకు భారీగా ఆదాయం సమకూరుతోంది.

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో ఓ అధికారి ఏకంగా కోటి రుపాయల జరిమానాలు వసూలు చేయగా.. విజయవాడ రైల్వే డివిజన్‌‌కు చెందిన ఎంజె.మాథ్యూ అనే చీఫ్‌ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ గుడివాడ స్క్వాడ్‌లో పనిచేస్తున్నారు. ఏడాది కాలంలో ఈయన రూ.1.02 కోట్ల జరిమానాలు వసూలు చేశారు.
ఎంజె.మాథ్యూ మొత్తం 12,707 కేసులు నమోదు చేశారు. 35ఏళ్ల కెరీర్‌లో మాథ్యూ జిఎం అవార్డుతో పాటు డిఆర్ఎం అవార్డు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌ అవార్డులు పొందారు. జిఎం నుంచి ఆయనకు అభినందనలు దక్కాయి.

గతేడాది ఏప్రిల్ 1 నుంచి మార్చి 16వ తేదీ వరకు తమ జోన్ పరిధిలోని ముగ్గురు అధికారులు ఒక్కొక్కరు రూ.కోటికిపైగా టిక్కెట్ లేని ప్రయాణికుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేసినట్టు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ ఎస్ నంద కుమార్ 27,787 కేసులు నమోదుచేసి రూ.1.55 కోట్లు జరిమానా విధించారు. ఇప్పటి వరకూ టిక్కెట్ చెకింగ్ స్టాఫ్ జరిమానా కింద వసూలు చేసిన అధిక మొత్తం ఇదే. ముంబయికి ఇలాంటి అంకితభావం ఉన్న అధికారులు అవసరమంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అరోకియా మేరీని ముంబయికి బదిలీ చేయాలని కోరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+