భూమా నాగిరెడ్డిపై రౌడీ షీట్: మరో 12 మందిపైనా
కర్నూలు: గత నేర చరిత్ర, కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘటనకు సంబంధించి రెండు హత్యాయత్నం కేసులను నమోదు చేశామని, ఎస్సీ, ఎస్టీ కేసుల ఆధారంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డితోపాటు వైసీపీ వర్గానికి చెందిన మరో 12 మందిపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ తెరిచామని ఆయన తెలిపారు.
వీరిలో కౌన్సిలర్లు శివశంకర్ యాదవ్, కరీముల్లా, ఎం.కొండారెడ్డి, కృపాకర్‌లతోపాటు వైసీపీ నాయకులు చంటి, వడ్డె శ్రీను, వడ్డె మనోజ్ కుమార్, షేక్‌అజ్మీర్, ఏవీఆర్ ప్రసాద్, ఎస్.మధు అలియాస్ దేవనగర్ మధు, ఎంబీటీ బాబు, సి. నాగేశ్వర్ రావు ఉన్నారని ఏఎస్పీ వివరించారు. మున్సిపల్ కౌన్సిల్ ఘటనకు సంబంధించి ఇప్పటికి 9 మందిని అరెస్టు చేశామని, మిగతా వారిపైనా నిఘా ఉంచామని చెప్పారు.

నంద్యాలలో గూండాయిజం చేస్తే ఎంతటివారినైనా సహించేది లేదన్నారు. అలాగే.. టీడీపీ చైర్మన్ సులోచన, కౌన్సిలర్లు వెంకటసుబ్బయ్య, నాయకులు కృష్ణమోహన్, జాకీర్ హుసేన్, అమీర్ బాషా, లక్ష్మీనారాయణపై నమోదు చేసిన కేసులపై దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం భూమా నాగిరెడ్డి, వైసీపీ నాయకులపై పెట్టిన కేసులను, తెరిచిన రౌడీషీట్‌ను చట్టపరంగా, సమర్థంగా ఎదుర్కొంటామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మీడియాకు తెలిపారు.
ఇటీవల నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘర్షణ నేపథ్యంలో భూమా నాగిరెడ్డిపై, వైసిపి కౌన్సిలర్లపై టిడిపి నాయకులు ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదు మేరకు భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేయడానికి భారీగా పోలీసులు మోహరించారు. అయితే, భూమా నాగిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు.












Click it and Unblock the Notifications