విశాఖలో రౌడీషీటర్ కు నడిరోడ్డుపై మహిళల బడితెపూజ; అతను చేసిన అకృత్యాలు తెలిస్తే షాక్!!
బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధులలో మాత్రం ఎలాంటి భయము కనిపించడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట బాలికలను కామపిశాచులు వేధిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు బాలికల సంరక్షణ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత భద్రతను ఏర్పాటు చేసినా సరే అవేవి పట్టించుకోకుండా అభం శుభం తెలియని బాలికల బ్రతుకులపై విషం చిమ్ముతూనే ఉన్నారు కామాంధులు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే విశాఖలో చోటు చేసుకోగా అది తెలిసిన తల్లిదండ్రులు సదరు కామాంధుడికి దేహశుద్ధి చేశారు.

పెన్నులు, పుస్తకాలు ఆశ చూపి మైనర్ బాలికలతో అసభ్య ప్రవర్తన
విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం నాడు ఓ సంఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ రౌడీ షీటర్ ను బాలికల తల్లిదండ్రులతో పాటు, స్థానిక మహిళలు చితక్కొట్టారు. పుస్తకాలు, పెన్నులు ఇస్తానని ఆశ చూపి అభం శుభం తెలియని మైనర్ బాలికలను తీసుకువెళ్లి వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని స్థానిక మహిళలు సదరు రౌడీషీటర్ కు దేహశుద్ధి చేశారు. ట్యూషన్ కి వెళ్ళిన బాలికలు ఉపాధ్యాయులకు చెప్పడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నడిరోడ్డు మీద రౌడీ షీటర్ ను చితకబాదిన మహిళలు
అభం శుభం తెలియని బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న రౌడీ షీటర్ చిన్నారావుకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న స్థానికులు, బాలికల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగారు. నడిరోడ్డు మీద లాగి బట్టలు చించి మరీ వీపు విమానం మోత మోగించారు. రక్తం వచ్చేలా చితక్కొట్టారు. మహిళలంతా ఏకమై కామాంధుడిపై కన్నెర్ర చేశారు. నడిరోడ్డు మీద రౌడీ షీటర్ చిన్నారావు ఉతికి ఆరేశారు. చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ముసుగులో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Recommended Video

బడితెపూజ చేసి పోలీసులకు అప్పగించిన మహిళలు
స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో రౌడీ షీటర్ దోమల చిన్నారావు రెచ్చిపోతున్నాడు అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకునేందుకు వెళ్లిన చిన్నారులను వారికి కావలసిన పెన్నులు, పుస్తకాలు ఇస్తానని చెప్పి మభ్యపెట్టి ఇంటికి తీసుకువెళ్లి వర్ణించలేని విధంగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వారు మండిపడుతున్నారు. ఇలాంటి నీచులను వదిలి పెట్టకూడదని భావించిన స్థానిక మహిళలు రౌడీ షీటర్ చిన్నారావుకు బడిత పూజ చేశారు. అనంతరం మహిళలంతా కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రౌడీ షీటర్ చిన్నారావును కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారావును అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications