ఎవరీ సుబ్బు?: పగ తీరకపోతే మమ్మల్ని కూడా చంపమన్న భార్య.. హత్యతో ఉలిక్కిపడ్డ బెజవాడ..

Subscribe to Oneindia Telugu
  Vijayawada : విజయవాడ లో రౌడీ షీటర్ దారుణ హత్య : Video

  విజయవాడ: బెజవాడ మరోసారి ఉలిక్కిపడింది. పట్టపగలు నడిరోడ్డుపై సబ్రహ్మణ్యం అనే రౌడీషీటర్ ను ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపారు. హత్య వెనుక విజయవాడ టీడీపీ యూత్ విభాగ అధ్యక్షుడు కాట్రగడ్డ శ్రీను హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తుండటం కేసు తీవ్రతను మరింత పెంచుతోంది.

  నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే హత్య జరగడంతో స్థానికులు భయపడిపోయారు. సినీపక్కీలో నిందితుడిని హత్య చేసిన దుండగులు.. నిమిషాల వ్యవధిలోనే అక్కడినుంచి పరారయ్యారు. సుబ్రహ్మణ్యం రౌడీ షీటర్ కావడంతో.. ఇటీవలి కాలంలో అతనికి ఎవరితోనైనా శత్రుత్వం ఏర్పడిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

  సుబ్బు నేపథ్యం:

  సుబ్బు నేపథ్యం:

  తెనాలి నాజర్‌పేటకు చెందిన వేమూరి సుబ్రహ్మణ్యం(35)అలియాస్‌ సుబ్బు కొద్దికాలంగా విజయవాడ రాజరాజేశ్వరీపేటలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని భార్య దుర్గ, కుమారుడు తేజ (17), మనోజ్‌ (14)తో కలిసి నివసిస్తున్నాడు. గతంలో టీడీపీ యువజన నాయకుడు కాట్రగడ్డ శ్రీను వద్ద సుబ్బు కొంతకాలం పనిచేశాడు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్, కాల్ మనీ వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

  విజయవాడ లో రౌడీ షీటర్ దారుణ హత్య : Video

   పట్టపగలే హత్య.. ఇద్దరు అరెస్ట్

  పట్టపగలే హత్య.. ఇద్దరు అరెస్ట్

  బుధవారం ఉదయం 10గం. సమయంలో సుబ్బు ఇంటి నుంచి బైక్ పై బయలుదేరినట్లు చెబుతున్నారు. మాచవరం ప్రాంతంలోకి రాగానే మూడు బైక్ లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు సుబ్బుపై దాడి చేశారు.

  కత్తులు, గొడ్డళ్లతో సుబ్బుపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. సుబ్బు ఎడమ భుజం పూర్తిగా చిధ్రమై ఎముకలు బయటపడ్డాయి.
  హత్య విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీమ్స్ తో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.

  కాగా, సుబ్బు హంతకుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు తెనాలికి చెందినవారు కావడం.. సుబ్బు స్వస్థలం కూడా తెనాలి కావడంతో.. అక్కడ ఎవరితోనైనా విభేదాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు దృష్టి సారించారు.

   అతనే చంపాడు?:

  అతనే చంపాడు?:

  ఘటనా స్థలంలో సుబ్బు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో సుబ్బు కుటుంబ సభ్యులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై హత్యకు పాల్పడ్డవారిని ఆపకుండా.. తమను అడ్డుకుంటున్నారేంటి? అని ప్రశ్నించారు. అయితే క్లూస్ టీమ్ వచ్చేవరకు ఎవరిని అనుమతించబోమని చెప్పడంతో.. దూరంగా నిలబడి బోరున ఏడ్చారు.

  కాగా, కాట్రగడ్డ శ్రీనే ఈ హత్య చేయించి ఉంటాడని సుబ్బు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశం కూడా శ్రీను ఇంటికి అతి సమీపంలోనే ఉండటంతో అతనే హత్య చేయించి ఉంటాడని ఆరోపించారు. అతని వద్ద పని మానేసినందుకే.. మరో వర్గంతో చేతులు కలిపి హత్య చేయించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

   పగ తీరకపోతే మమ్మల్ని కూడా:

  పగ తీరకపోతే మమ్మల్ని కూడా:

  'నా భర్తను చంపేశారు.. ఇప్పుడు నా కుటుంబానికి దిక్కేది.. కుటుంబమంతా రోడ్డున పడింది. ఇప్పటికీ పగ తీరకపోతే మమ్మల్ని కూడా చంపండి. పొట్ట తిప్పల కోసం విజయవాడ వస్తే నా భర్తను పొట్టనపెట్టుకున్నారు.' అంటూ మృతుడు సుబ్బు భార్య కన్నీరుమున్నీనరుగా విలపించింది. తమ కొడుకును కాట్రగడ్డ శ్రీనే చంపించాడని మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు కూడా ఆరోపించారు.

   సుబ్బు అన్న కూడా హత్యే:

  సుబ్బు అన్న కూడా హత్యే:

  డీసీపీ గజరావుభూపాల్‌ హత్యపై స్పందించారు. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల క్రితం సుబ్బు అన్నయ్య సత్యనారాయణ కూడా హత్యకు గురయ్యాడని చెప్పారు. అప్పటినుంచే సుబ్బుకు శ్రతువులు ఉండొచ్చునని అనుమానిస్తున్నట్లు తెలిపారు. సుబ్బు స్వస్థలం తెనాలి వెళ్తే అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీస్ టీమ్స్ ను అక్కడికి పంపించినట్లు వెల్లడించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Rowdy sheeter Subbu was murdered by his opponents in Vijayawada on Wednesday. His family made allegations on TDP Leader Katragadda Srinu over murder.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి