ఎంఎంటీఎస్ రైళ్లలో ఆకతాయిల ఆగడాలు: 50 మంది యువకులు, 10 మంది హిజ్రాలు అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లలో ఆకతాయిల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రైళ్లలోని మహిలా బోగీల్లో ప్రవేశిస్తున్న ఆకతాయిల వేధింపులు, పురుషుల బోగీల్లో హిజ్రాల వెకిలి చేష్టలూ తట్టుకోలేకపోతున్నామంటూ రైల్వే పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
దీంతో ప్రయాణికుల ఫిర్యాదులతో అటు ఆకతాయిలు, ఇటు హిజ్రాల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు. ఇందులో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు జరిపారు.

ఈ తనిఖీల్లో మహిళా బోగీల్లోకి ప్రవేశించిన 50 మంది యువకులతో పాటు పురుషుల బోగీల్లో వెకిలి చేష్టలకు దిగిన పది మంది హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న మరో 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications