వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పసుపు కండువాతో Jr.NTR : టీడీపీ పగ్గాలకు రెడీ - ట్రిపుల్ ఆర్ ద్వారా సంకేతాలు..?

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పు అనే చర్చ కొద్దిరోజులుగా సాగుతోంది. ఇది కాస్తా పీక్స్ చేరుకుంటోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి చేతుల్లో ఉన్న తెలుగుదేశం నాయకత్వంపై మళ్లీ నందమూరి కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దానికి అర్హత ఉన్న ఏకైక వ్యక్తి.. జూనియర్ ఎన్టీఆరేనంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి టీడీపీ సీనియర్ నేతలు సైతం కుండబద్దలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి.

పసుపు కండువా తలకట్టుతో జూనియర్..

ఈ పరిస్థితుల మధ్య తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి కిందటే విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) ఉగాది లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్ పసుపు కండువాతో కనిపించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ లుక్ విడుదలైన వెంటనే తెలుగుదేశం పార్టీ-జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. ఎన్టీఆర్ పసుపు కండువాతో కనిపించడం పట్ల ఆకాశమే హద్దుగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ చేతుల్లో తెలుగుదేశం పార్టీ జెండాను పెట్టి మరీ.. మురిసిపోతున్నారు. పసుపు కండువాలో తారక రాముడు మెరిసిపోతున్నాడంటూ ట్వీట్లు చేస్తున్నారు.

రామ్‌చరణ్‌ తలకట్టుపైనా

ఎన్టీఆర్‌తో పాటు అదే ఉగాది లుక్‌లో కనిపించిన రామ్‌చరణ్ కూడా పసుపు కండువాతో కనిపించాడు. రామ్ చరణ్ ధరించిన పసుపురంగు తలకట్టు మీద టీడీపీ అనే అక్షరాలను ముద్రించిన ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతున్నారు. తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని ఏ స్థాయిలో కోరుకుంటున్నారనేది దీనితో స్పష్టమౌతోంది. మొన్నటికి మొన్ని తెల్లవారితే గురువారం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనూ జూనియర్ అభిమానులు.. ఆయనను సీఎం, సీఎం అంటూ సంబోధించడం, దానికి ఇంకా సమయం ఉందంటూ ఆయన వారించడం తెలిసిందే.

చంద్రబాబుకు ప్రత్యామ్నాయం ఎవరు?

ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలను అందించాలనే డిమాండ్.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు కూడా వినిపించింది. కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సాక్షాత్తూ చంద్రబాబు ముందే ఈ మేరకు నినాదాలు చేశారు. వినిపించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకుని రావాలనే డిమాండ్..తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి వరకూ వెళ్లిందనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి ఉండకపోవచ్చు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో.. ఆయన అభిమానులే ఈ డిమాండ్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

నారా లోకేష్‌ను అంగీకరించలేకపోతున్నారా?

నారా లోకేష్‌ను అంగీకరించలేకపోతున్నారా?

తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్‌ను క్యాడర్ అంగీకరించలేకపోతోందనేది బహిరంగ రహస్యమే. దీనికి నిదర్శనాలు చాలానే ఉన్నాయి. ఈ విషయంలో గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్త కూడా జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నారే తప్ప నారా లోకేష్‌కు పార్టీ సారథ్య బాధ్యతలను అప్పగించడానికి ఇష్టపడట్లేదు. నారా లోకేష్.. ప్రస్తుతం టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2019 నాటి ఎన్నికల్లో అమరావతికి గుండెకాయగా చెప్పుకొనే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరీ ఆయన ఓడిపోయారు. చంద్రబాబుతో పోల్చితే.. నారా లోకేష్‌లో నాయకత్వ లక్షణాలు లేవనేది ఓ సగటు టీడీపీ అభిమాని అభిప్రాయం.

జూనియర్ వైఖరేంటీ?

జూనియర్ వైఖరేంటీ?

రాజకీయ అరంగేట్రం విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా స్పందించట్లేదు. తన పరిమితులు, పరిధులకు లోబడే ఉంటున్నారు. పార్టీ నాయకత్వమే కావాలనుకుంటే.. అది ఆయన చేతుల్లో వచ్చి వాలుతుంది. దానికోసం ఆయన పెద్దగా శ్రమించాల్సిన పనీ ఉండకపోవచ్చు. ప్రస్తుతం జూనియర్ ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. రాజకీయాల్లోకి రావడానికి ఏ మాత్రం ఇష్ట పడట్లేదు. ఆ పేరు వింటేనే ఆయన చిరాకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఇదివరకు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమో షూటింగ్ సమయలోనూ ఆయన తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. దానికి ఇంకా సమయం ఉందని స్పష్టం చేశారు.

English summary
RRR Ugadi look: Tollywood actor Jr NTR seen in TDP's official yellow colour scarf, fans go gaga. recently Jr NTR was witness to several of his supporters raising political slogans at a film event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X