తండ్రికి అన్యాయం చేసి పబ్లిసిటీ రాజకీయాలా ? పురందేశ్వరీ ఆలోచించమ్మా.. సాయిరెడ్డి ట్వీట్
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కేంద్రంగా మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రం ఆయన పేరుతో 100 రూపాయల నాణెం విడుదల చేస్తోంది. ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వారసులు అందరినీ ఆహ్వానించి భార్య లక్ష్మీపార్వతిని మాత్రం పక్కనబెట్టింది. చివరికి అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా ఆహ్వానించి తనను పక్కనబెట్టడంపై లక్ష్మీపార్వతి ఫైర్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా ఉన్న ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతికి పరోక్షంగా మద్దతిస్తూ.. ఆయన కుమార్తె పురందేశ్వరిని విమరిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఘాటు ట్వీట్ పెట్టారు. ఇందులో ఎన్టీఆర్ కు ఆయన కుటుంబం ఎలా అన్యాయం చేసిందో వివరాలతో సహా ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ కు ఇంత అన్యాయం చేసి ఇప్పుడు 100 రూపాయల కాయిన్ పేరుతో పబ్లిసిటీ రాజకీయాలు చేస్తారా అంటూ పురందేశ్వరిని సాయిరెడ్డి ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా! అంటూ మొదలుపెట్టి పాత విషయాలన్నీ ప్రస్తావించారు.
a) వాటాలు తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు పాడు పెట్టేశారు.
b) అబిడ్స్ లో అయన ఇల్లు అమ్ముకున్నారు.
c) బంజారాహిల్స్ లో ఆయన మరణించిన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారు.
d) దానికి ఎదురు ఉన్న అయన ఇంట్లో మ్యూజియం పెట్టాలనుకున్నారు. అయన ఆశయాలకు నీళ్ళుకొట్టారు.
2/2. తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో హృదయ అంతరంగం నుంచి రావాలేకానీ...పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా!
e) సమాధి తప్ప ఆయనకు స్మారకచిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు 100 రూపాయల నాణెం అంటారు.
f) భారతరత్న గురించి మీరు ఢిల్లీలో ఏనాడు అడగలేదు. రాజకీయ పూర్వాశ్రమంలో మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అప్పటి మీ నాయకురాలు సోనియాకు మీరు చెప్పిన హృదయపూర్వక కృతఙ్ఞతలు మరచిపోలేమమ్మా!
1/2. పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2023
a) వాటాలు తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు పాడు పెట్టేశారు.
b) అబిడ్స్ లో అయన ఇల్లు అమ్ముకున్నారు.
c) బంజారాహిల్స్ లో ఆయన మరణించిన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారు.
d) దానికి ఎదురు ఉన్న అయన ఇంట్లో మ్యూజియం… pic.twitter.com/7oO6E7DiEq
ఈ ట్వీట్ లో తన తండ్రి దివంగత ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటూ పార్లమెంటులో ఆయన విగ్రహావిష్కరణపై గతంలో పురందేశ్వరి పెట్టిన పోస్టును కూడా జత చేశారు. ఇందులో పురందేశ్వరి అప్పట్లో యూపీఏ ఛైర్ పర్సన్ గా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications