రాష్ట్రం లో 220 తుఫాన్ బిల్డింగ్ ల నిర్మాణం: 3,500 కోట్లు వినియోగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ (APSDMA) కార్యాలయంలో నిర్వహించిన "అంతర్జాతీయ విపత్తుల నివారణ దినోత్సవం (International day for Disaster Reduction)''
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ (APSDMA) కార్యాలయంలో నిర్వహించిన "అంతర్జాతీయ విపత్తుల నివారణ దినోత్సవం (International day for Disaster Reduction)'' వేడుకల్లో ఎండోమెంట్,ల్యాండ్ ,డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ మన్మోహన్ సింగ్ మఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ మన్మోహన్ సింగ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి అంతర్జాతీయ విపత్తుల నివారణ దినోత్సవం-2017 వేడుకలను ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యలయంలో కాన్ఫరెన్స్ హాల్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెబ్ సైట్ www.apsdma.ap.gov.in ను ప్రారంభించారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ మాన్యూవల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

శ్రీ మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతూ అంతర్జాతీయ విపత్తుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ విపత్తుల నివారణ చర్యల పట్ల అవగాహన కల్పించుకోవాలన్నారు. పర్యావరణం పరిశుభ్రంగా ఉంచుకోవడం , చెట్లు పెంచుకోవడం లాంటి వివిధ అంశాల ద్వారా విపత్తులను స్వయంగా ప్రజలు,కమ్యూనిటీలు నివారించవచ్చు అన్నారు. విపత్తులు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియవని వాటి ప్రమద తీవ్రతను తగ్గించడానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు , మాక్ ఎక్సర్ సైజ్ లు , ట్రైనింగ్ లు ఇస్తున్నట్లు తెలియజేశారు.
మొబైల్ యాప్స్ , సాఫ్టవేర్ వంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో విపత్తుల నిర్వహణ శాఖ ముందుంటుందన్నారు. దేశంలోనే మొట్టమొదటిగా పిడుగుపాటును 40-30 నిమిషాల ముందుగానే విపత్తుల శాఖ సమాచారం అందిస్తుందని తెలియజేసారు.విపత్తుల సమయంలో విద్యార్దులు,కమ్యూనిటీస్ ,ఎన్జీవోస్ సహకారం అందించాలని కోరారు.
ప్రపంచ బ్యాంకు ద్వారా జాతీయ విపత్తు తగ్గింపు పధకము(APDRP) క్రింద 2200 కోట్లు, జాతీయ తూఫాను విపత్తు తగ్గింపు పథకము (NCRMP) క్రింద 1340 కోట్లు నిధులు వినియోగిస్తున్నమన్నారు.రాష్ట్రంలో 220 తుఫాను బిల్డింగ్ లు నిర్మించినట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో విపత్తుల ప్రమాదస్థాయిని తగ్గించుకునే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ శ్రీ ఎం.వి శేషగిరిబాబు గారు విపత్తుల శాఖ వినియోగించబొతున్న కొత్త సాంకేతికతలను వివరించారు. విపత్తు ముందస్తు హెచ్చరికలు పంపడానికి " సేల్ బ్రాడ్ కాస్టింగ్ " ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ సేల్ బ్రాడ్ కాస్టింగ్ ద్వారా లోకేషన్ లో ఉన్న అన్ని నేట్ వర్క్స్ వారికి సమాచారం అందుతుందన్నారు. వాతావరణానికి సంబంధించిన సమాచారం అంత ఒకే దానిలో వచ్చేట్లు " సిస్టమ్ ఇంటిగ్రేషన్ " గురించి వివరించారు.
ఆనంతరం తరువాత విపత్తుల శాఖలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించి వాతావరణ పర్యవేక్షణ విధానం , మాస్ మేసేజింగ్ ద్వారా ముందస్తు హెచ్చరికలు చేరవేసే విధానం గురించి కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులకు తెలియజేశారు.












Click it and Unblock the Notifications