వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంక్ దోపిడీ: రూ 4కోట్ల నగదు, బంగారం చోరీ

By Pratap
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: బ్యాంకుపై పక్కా ప్రణాళికతో విరుచుకుపడి నాలుగు కోట్ల విలువైన 13.5 కిలోల బంగారం, రూ. 14 లక్షల నగదుని ఎత్తుకుపోయారు. చివరకు సీసీ కెమెరాలనూ వదిలిపెట్టలేదు. రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఉండే బ్యాంకుపై దొంగులు కన్నేసి, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ చౌరస్తాలోని గ్రామీణ వికాస్‌ బ్యాంకులో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం - బాలానగర్‌ చౌరస్తాలోని అద్దె ఇంటి మొదటి అంతస్తులో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకును నిర్వహిస్తున్నారు. రైతులకు పంట, వ్యాణిజ్య, బంగారంపై రుణాలను బ్యాంకు ద్వారా ఇస్తున్నారు. దాదాపు 500 మంది 13.5 కిలోల బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఆ బంగారాన్ని 14 లక్షల రూపాయల నగదును స్ర్టాంగ్‌ రూమ్‌లోని లాకర్‌లో భద్రపరిచారు.

Rs 4 crore worth of gold, cash robbed from bank

బ్యాంక్‌ ముందు వైపు జాతీయ రహదారి ఉండగా, మరో రెండు వైపులా ఖాళీ స్థలం ఉంది. బ్యాంకు ఉన్న మేడపైకి వెళ్లడానికి బయట నుంచే మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల గుండానే ఆగంతకులు పైకి చేరుకున్నారు.

ఉత్తరం వైపు ఉన్న ద్వారానికి బిగించిన గ్రిల్స్‌ను, తలుపు తాళాన్ని బద్దలుకొట్టారు. సరాసరి స్ర్టాంగ్‌ రూమ్‌ ముందుకెళ్లి సిలిండర్‌ గ్యాస్‌ కట్టర్‌తో తాళాన్ని తొలగించారు. లాకర్‌ను కూ డా అదే పద్ధతిలో కోసేశారు. 13.5 కిలోల బంగారం, 14లక్షల నగదును తీసుకుని పారిపోయారు. బ్యాంక్‌లోని సీసీ కెమెరాలను, కంప్యూటర్లకు సిగ్నల్‌ను అంది ంచే ఐపీ స్టార్‌ను సైతం ఎత్తుకుపోయారు.

సోమవారం ఉదయం బ్యాంకు తెరవడానికి ప్రయత్నించిన సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే బ్యాంక్‌ మేనేజర్‌ రవికిషోర్‌రెడ్డి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన డాగ్‌ స్వ్కాడ్‌, క్లూస్‌ టీమ్‌ ప్రారంభించాయి. బంగారం తాకట్టు పెట్టినవారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, రుణం చెల్లించిన ప్రతి ఒక్కరికీ తిరిగి బంగారం ఇస్తామని మేనేజర్‌ రవికిషోర్‌రెడ్డి తెలిపారు.

English summary
Burglars struck at the Grameena Vikas Bank located at Balanagar this weekend and walked away with huge cash and gold ornaments all worth Rs 4 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X