ఉప ఎన్నిక షాకింగ్: ఓటుకు రూ.7వేలు: గుడివాడ కొడాలి నాని వర్సెస్ రావి

విజయవాడ: గుడివాడ మున్సిపాలిటీ 19వ వార్డు ఉప ఎన్నికను టిడిపి, వైసిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసిపికి చెందిన వార్డు సభ్యుడు లక్ష్మణ రావు మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు డబ్బులు విరివిగా ఖర్చు పెడుతున్నాయి.

టిడిపి నుంచి రావి వెంకటేశ్వర రావు, వైసిపి నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని డబ్బులను ఏరులా పారిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

Rs 7,000 for vote in Gudivada municipality bypoll

గెలుపే లక్ష్యంగా ఓ వర్గం ఓటుకు రూ.7వేల వరకు ఇస్తుంటే, మరో వర్గం ఓటుకు రూ.6వేలతో పాటు వెండి కుంకుమ భరిణులు పంపిణీ చేస్తోంది. 2902 ఓట్లు ఉన్న ఈ వార్డులో ఒక్కో అభ్యర్థి రూ.కోటి చొప్పున ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

పోలింగ్ స్లిప్ చూపిస్తే డబ్బులు అందచేస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. కాగా, పోలింగ్‌ కేంద్రం ఎక్కువ మంది ఉండరాదని చెప్పడంతో రావి వెంకటేశ్వరరావు వర్గానికి, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+