ఎర్రచందనం డాన్ గంగిరెడ్డి అనుచరుడు శివశంకర్ అరెస్ట్
హైదరాబాద్: కడప జిల్లాలో శనివారం 8 మంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్రర్లను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ప్రధాన అనుచరుడు జంగాల శివశంకర్ కూడా ఉన్నాడని ఎస్పీ నవీన్ గులాటీ తెలిపారు.
కడప సబ్ డివిజన్ పరిధిలోని వల్లూరు వద్ద శనివారం వాహన తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 4.2 టన్నుల బరువైన 190 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. స్మగ్లర్లు కడప, కర్ణాటకకు చెంది వారిగా పోలీసులు గుర్తించారు.
దీని విలువ రూ.8 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నాలుగు కార్లు, లారీని సీజ్ చేశామని పోలీసుల తెలిపారు. గత కొంతకాలం నుంచి ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ బారీ స్ధాయిలో జరుగుతోన్న సంగతి తెలిసిందే.

ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఆపేందుకు గాను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎప్పటికప్పుడు స్మగ్లర్లపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుంటున్నారు.
చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్ల రాళ్ల దాడి:
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నడుంపల్లి అటవీ ప్రాంతంలో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు.
అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో 20 మంది స్మగ్లర్లు పరారయ్యారు. 10 మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లు పోలీసులపై జరిపిన దాడిలో ఐదుగురు టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications