America citizen: ఆ మహిళ ఫ్యామిలీకి ఏపీఎస్ఆర్టీసీ రూ. 9 కోట్లు చెల్లించాలి!
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ. 9 కోట్లు పరిహారం ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. మృతురాలు ప్రవాస భారతీయురాలు కావడం గమనార్హం.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2009, జూన్ 13న లక్ష్మి అనే మహిళ, ఆమె భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరానికి వెళ్తున్నారు. ఈ సమయంలోనే ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మి మృతి చెందగా.. మిగితా వారికి గాయలయ్యాయి.

అయితే, అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి ఆ దేశ శాశ్వత నివాసిగా ఉన్న తన భార్య అక్కడే నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని, ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి 9 కోట్ల పరిహారం ఇప్పించాలని మృతురాలి భర్త శ్యాంప్రసాద్ సికింద్రాబాద్ మోటర్ యాక్సిడెంట్ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు.
ఇరువైపుల వాదనలు విన్న ట్రైబ్యునల్.. రూ. 8.05 కోట్ల పరిహారం చెల్లించాలని చెల్లించాలని ఏపీఆర్టీసీని 2014లోనే ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగణ హైకోర్టును ఆశ్రయించగా.. రూ. 5.75 కోట్లు చెల్లించాలని తీర్పునిచ్చింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రూ. 9,64,5,220 పరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబానికి ఏపీఎస్ఆర్టీసీ ఆ మొత్తం చెల్లించాల్సి ఉంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications