వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 95 లక్షలు స్వాధీనం: టిడిపి అభ్యర్థివా? (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాదులోని బొల్లారం వద్ద పోలీసులు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ. 95 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి ఆ మొత్తం పట్టుబడింది. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళుతున్న బస్సును బొల్లారం వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఓ ప్రయాణీకుని వద్ద ఉన్న బ్యాగులో మొత్తం రూ. 95 లక్షల నగదును గుర్తించారు. డబ్బుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో ఎన్నికలకోసం తీసుకువెళుతున్న డబ్బుగా పోలీసులు భావించారు.

బ్యాగుకు సంబంధించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ డబ్బు ఎవరు ఇచ్చారు, ఎక్కడికి తీసుకువెళుతున్నావని విచారణ జరిపారు. బ్యాగుతో నగదు తీసుకువెలుతున్న వ్యక్తి పెద్దపల్లికి చెందిన చంద్రమౌళిగా పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకే పోలీసులు ఈ తనిఖీలు చేసినట్లు సమాచారం.

డబ్బు పట్టుబడిన బ్యాగులో కరీంనగర్ జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి సాంబారి ప్రభాకర్ పేర ఉన్న ప్లకార్డులు ఉన్నాయి. చంద్రవౌళిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కరీంనగర్ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ఫండ్ కోసం డబ్బుని తీసుకెళ్తున్నట్లు చెప్పాడు.

నిందితుడు వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డిసిపి జయలక్ష్మీ తెలిపారు. పట్టుబడిన డబ్బుని ఐటి శాఖకు అప్పగించనున్నట్లు ఆమె చెప్పారు. మీడియా సమావేశంలో బేగంపేట ఎసిపి బి మనోహర్, సిఐ జగన్, కంటోనె్మంట్ ఎన్నికల సహాయ అధికారి దేవేందర్‌లు పాల్గొన్నారు.

బస్సులో రూ. 95 లక్షలు స్వాధీనం: టిడిపి అభ్యర్థివా?

బస్సులో రూ. 95 లక్షలు స్వాధీనం: టిడిపి అభ్యర్థివా?

సికింద్రాబాద్‌లోని బొల్లారం వద్ద ఆర్టీసి బస్సులో చంద్రమౌళి అనే వ్యక్తి వద్ద పట్టుబడిన 95 లక్షల రూపాయల నగదు ఇదే..

 బస్సులో రూ. 95 లక్షలు స్వాధీనం: టిడిపి అభ్యర్థివా?

బస్సులో రూ. 95 లక్షలు స్వాధీనం: టిడిపి అభ్యర్థివా?

ఆర్టీసి బస్సులో నగదును తీసుకుని పోతున్న ప్రయాణికుడిని పట్టుకుని పోలీసులు విచారించారు. అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నగదు అని అతను చెప్పాడు.

సాంబారి ప్రభాకర్ డబ్బులా..

సాంబారి ప్రభాకర్ డబ్బులా..

డబ్బు పట్టుబడిన బ్యాగులో కరీంనగర్ జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి సాంబారి ప్రభాకర్ పేర ఉన్న ప్లకార్డులు ఉన్నాయి.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ

నిందితుడు వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డిసిపి జయలక్ష్మీ తెలిపారు. పట్టుబడిన డబ్బుని ఐటి శాఖకు అప్పగించనున్నట్లు ఆమె చెప్పారు.

పెద్దపల్లికి చెందిన వ్యక్తి

పెద్దపల్లికి చెందిన వ్యక్తి

బ్యాగుతో నగదు తీసుకువెలుతున్న వ్యక్తి పెద్దపల్లికి చెందిన చంద్రమౌళిగా పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకే పోలీసులు ఈ తనిఖీలు చేసినట్లు సమాచారం.

English summary
Police have seized Rs 95 lakhs from passenger, Chandramouli in an RTC bus at Bollaram in Secendurabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X