Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో రూ.99 కే మద్యం బాటిల్ పై తాజా అప్ డేట్..!

ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి రావడంతో పాటు షాపుల కేటాయింపు లాటరీ కూడా ముగియడంతో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో అన్నింటికంటే ఎక్కువగా రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యంపైనే అందరి ఫోకస్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ బాటిళ్ల మద్యం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై అధికారులు ఇవాళ క్లారిటీ ఇచ్చారు.

మద్యం షాపుల లాటరీ పూర్తి కాగానే ఎంత మేర రూ.99 క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులో ఉంటుందన్న దానిపై అధికారుల వద్ద పూర్తి అంచనాలు లేవు. దీంతో ముందు కొంత స్టాక్ తెప్పించుకుని, డిమాండ్ ను బట్టి మిగతా స్టాక్ కు ఆర్డర్ ఇవ్వాలన్న చర్చ జరిగింది. దీంతో ఇప్పుడు ఆరంభ స్టాక్ కోసం పెట్టిన ఆర్డర్ల ప్రకారం షాపులకు సరఫరా ప్రారంభమైంది. తొలుత 10 వేల కేసులకు ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తోంది.

rs 99 liquor bottles to be available in shops from next week in ap

గురువారం నాటికి 10 కేసుల ఆర్డర్ పెట్టామని, సోమవారానికి మరో 25 వేల కేసులు ఆర్డర్ పెడతామని అధికారులు తెలిపారు. అలా పెంచుకుంటూ పోతూ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని మద్యం షాపుల్లో 2 లక్షల కేసుల వరకూ ఆర్డర్ పెట్టబోతున్నట్లు చెప్తున్నారు. దీంతో పలు చోట్ల రూ.99 క్వార్టర్ బాటిల్ మద్యం కోసం మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు. అయితే త్వరలోనే స్టాక్ పెడతామని సిబ్బంది వారికి జవాబు ఇస్తున్నారు.

మరోవైపు మద్యం ధరల విషయంలోనూ పారదర్శకంగా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ఓ కమిటీని నియమించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న మద్యం బాటిళ్ల ధరలను ఈ కమిటీ సవరించి ఫైనల్ చేయనుంది. ఇందులో పాత బ్రాండ్ల ధరల సవరణతో పాటు కొత్త బ్రాండ్ల ధరల నిర్ణయం కూడా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కమిటీ నిర్ణయించిన కొత్త ధరల మేరకే విక్రయాలు జరుగుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+