దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

ఏపీలో ఆరెస్సెస్ జోక్యం: టీటీడీ చైర్మన్‪గా సుధాకర్ నియామకానికి నో.. కాదంటే మంత్రి రాజీనామా?

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   ఏపీలో ఆరెస్సెస్ జోక్యం.. కాదంటే మంత్రి రాజీనామా?

   అమరావతి: ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ నియామకం విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మోకాలడ్డు పెట్టినట్లు తెలుస్తోంది. కడపజిల్లాకు చెందిన టీడీపీ నేత సుధాకర్‌ యాదవ్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కానీ, సుధాకర్‌ నియామకాన్ని అడ్డుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయించినట్లు సమాచారం. సుధాకర్‌ యాదవ్‌కు క్రైస్తవ సంఘాలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని, అటువంటి వ్యక్తిని ఇంత ముఖ్యమైన దేవాలయ చైర్మన్‌గా నియమించడం సరికాదని ఆ సంఘ నాయకత్వం వాదిస్తోంది.

   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ తొలిసారి జోక్యం చేసుకోవడంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆర్ఎస్ఎస్ అభిప్రాయాన్ని కాదని ప్రభుత్వం ముందుకెళితే.. దేవాదాయశాఖ మంత్రిగా మాణిక్యాల రావుతో రాజీనామా చేయించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

    ఆర్థిక మంత్రి యనమలకు వియ్యంకుడు సుధాకర్

   ఆర్థిక మంత్రి యనమలకు వియ్యంకుడు సుధాకర్

   సుధాకర్‌ యాదవ్‌ కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఆ మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు ఆయన వియ్యంకుడు. టీటీడీ గత పాలక మండలిలో ఆయన సభ్యుడుగా పనిచేశారు. మైదుకూరులో ఈసారి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించే యోచనలో ఉన్న టీడీపీ అధినాయకత్వం... సుధాకర్‌ యాదవ్‌కు టీటీడీ చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. చైర్మన్‌గా ఆయన పేరు ప్రచారంలోకి వచ్చిన తర్వాత మైదుకూరు అసెంబ్లీ స్థానం పరిధిలో పెట్టిన కొన్ని ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

    క్రైస్తవులతో సంబంధాలు ఉన్న వ్యక్తులు వద్దని ఆరెస్సెస్

   క్రైస్తవులతో సంబంధాలు ఉన్న వ్యక్తులు వద్దని ఆరెస్సెస్

   అక్కడ స్థానికంగా జరిగిన క్రైస్తవ సువార్త కూటమి కార్యక్రమాలకు ఆహ్వానం పలుకుతూ పెట్టిన ఈ ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో కూడా ఉంది. వారి కార్యక్రమానికి ఆయన ఆర్థిక సాయం చేయడంతో నిర్వాహకులు సుధాకర్‌ ఫొటో పెట్టారని ప్రచారం జరిగింది. దీనిపైనే ఆర్‌ఎస్‌ఎస్‌ అభ్యంతరం లేవనెత్తింది. ‘సుధాకర్‌ యాదవ్‌ క్రైస్తవుడు కాకపోవచ్చు. కానీ, ఆయనకు వారితో ఏదో ఒక రూపంలో సంబంధాలు ఉన్నాయి. టీటీడీలో 40 మంది వరకూ అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారని ఆలయ ఈవో స్వయంగా చెప్పారు. సుధాకర్‌ యాదవ్‌ వంటివారు చైర్మన్‌ అయితే అన్య మతస్థులైన టీటీడీ ఉద్యోగుల పట్ల ఉపేక్షా భావంతో వ్యవహరించే అవకాశం ఉంది. దీనివల్ల ఆలయ పవిత్రత దెబ్బ తింటుంది' అని ఆ సంఘం నేత ఒకరు చెప్పారు.

    చంద్రబాబు సర్కార్ ముందుకెళితే మాణిక్యాల రావు రాజీనామా?

   చంద్రబాబు సర్కార్ ముందుకెళితే మాణిక్యాల రావు రాజీనామా?

   ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి భరత్‌ రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ తరఫున మంత్రులుగా ఉన్న మాణిక్యాలరావు, కామినేని శ్రీనివా్‌సలకు ఫోన్‌ చేసి సుధాకర్‌ నియామకంపై సంఘ్‌ తీసుకొన్న నిర్ణయాన్ని చెప్పారు. తమ అభ్యంతరాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని, నిర్ణయం మార్చుకొనేలా చూడాలని వారిని కోరారు. అయినా ప్రభుత్వం ముందుకు వెళ్తే ఆర్‌ఎస్ఎస్‌ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కూడా అంతర్గతంగా నిర్ణయం తీసుకొన్నారు. అవసరమైతే దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుతో రాజీనామా కూడా చేయించాలని అందులో ఒక వర్గం ప్రతిపాదించింది.

    క్రైస్తవులతో సుధాకర్ సంబంధాలపై నిఘా దర్యాప్తు

   క్రైస్తవులతో సుధాకర్ సంబంధాలపై నిఘా దర్యాప్తు

   తనకు క్రైస్తవులతో సంబంధాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంతో సుధాకర్‌ యాదవ్ విభేదిస్తున్నారు. వివిధ వర్గాలవారు నిర్వహించే కార్యక్రమాల్లో రాజకీయ నాయకులుగా తమ ఫొటోలు పెట్టడం సహజంగా జరుగుతుందని, దానికి తనపై ఇటువంటి ముద్ర వేయడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆరోపణపై నిఘా విభాగ నివేదిక కోరింది. ఆయనకు క్రైస్తవ సంఘాలతో సంబంధం లేదని ఆ విభాగం నివేదించినట్లు చెబుతున్నారు.

   English summary
   RSS interfear in the AP Government affairs that particularly it objects that appointment to be Sudhakar Yadav as of TTD Chairman. Because he has links with Cristian communities. But AP Intellegence report dismissed this allegations.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more