మహిళలపై కండక్టర్ వికృత చేష్టలు, వలపన్ని అరెస్టు చేసిన పోలీసులు
భార్య స్నేహితులరాలితో పాటు యువతులు, మహిళలు సుమారు 200 మందికి అసభ్యకరంగా మేసేజ్ లు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్న ఆర్ టి సి కండక్టర్ తో పాటు ఆయన స్నేహితుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.
విజయవాడ:భార్య స్నేహితులరాలితో పాటు యువతులు, మహిళలు సుమారు 200 మందికి అసభ్యకరంగా మేసేజ్ లు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్న ఆర్ టి సి కండక్టర్ తో పాటు ఆయన స్నేహితుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.
విజయవాడకు చెందిన పమిడిపాటి శ్రీనివాస రావు ఆయన స్నేహితుడు మార్లపూడి శామ్యూల్ సినీఫక్కిలో అరెస్టు చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు వేర్వేరు ఫోన్ నెంబర్ల నుండి చెప్పలేని విధంగా అసభ్యకర మేసేజ్ లతో వేధిస్తున్నారని ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో నివసిస్తోన్న ఓ యువతి ఈ నెల 21వ, తేదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గవర్నర్ పేట బస్ డిపో వద్ద ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 5 సెల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు , 9 మొమరీ కార్డులను స్వాధీనం చేసుకొన్నట్టు పోలీసులు చెప్పారు.నిందితుల్లో ఒకరు కండక్టర్. కండక్టర్ గా పనిచేసే శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
విధి నిర్వహణలో ఉన్న సమయంలో కూడ మహిళా ప్రయాణీకులపై చేతులు వేయడం, వారు దిగే సమయంలో బస్సు మెట్ల వద్ద నిలబడి వారిని అసభ్యకరంగా తాకేవాడని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. పోన్ ద్వారా మహిళలకు అసభ్యకరమైన మేసేజ్ లు పంపి వికృతానంద పొందుతాడని చెప్పారు. బస్సుల్లో ప్రయాణీంచే యువతులు చూపే బస్సుల్లో నెంబర్లను వారికి తెలియకుండా తీసుకోని పోన్ చేసి వేధించేవాడని పోలీసులు చెప్పారు.
తన భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ లో ఉన్న మహిళల నెంబర్లు తీసుకోవడం, రోడ్లపై, పేపర్లపై వచ్చిన ఆడపిల్లలు, మహిళల ఫోన్ నెంబర్లను సేకరించి వారికి అసభ్యకరమైన మేసేజ్ లు పంపేవారని పోలీసులు చెప్పారు.
బస్సులో కలిసిన సింగ్ నగర్ కు చెందిన శ్యామ్యూల్ కు కూడ ఇదే అలవాటు ఉండడంతో కండక్టర్ తో కలిసి ఆయన మేసేజ్ లు పంపేవాడని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications