ఆపండి: ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టు డెడ్‌లైన్, రెండు రాష్ట్రాలకు చెప్తాం

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు అల్టిమేటం జారీ చేసింది. బుధవారం ఉదయం లోపు సమ్మె విరమించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం మంగళవారం హెచ్చరించింది. రెండు రోజుల గడువు కావాలని కార్మిక సంఘాలు కోరగా, అందుకు తిరస్కరించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

బుధవారం ఉదయం 10.30 లోపు సమ్మె విరమించకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రెండు రాష్ర్టాల ప్రభుత్వాలను ఆదేశిస్తామని కోర్టు కార్మికులను హెచ్చరించింది. వాదనలు విన్న ధర్మాసనం ఏ నిబంధనల ప్రకారం సమ్మె చేస్తున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రశ్నించింది.

సమ్మె చట్ట విరుద్ధమైనది వ్యాఖ్యానించింది. ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమేనన్న న్యాయస్థానం సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కార్మికులు పరిగణనలోకి తీసుకోవాలని, తక్షణమే సమ్మెను విరమించాలని ఆదేశించింది.

RTC strike to continue on Wednesday, HC gives day's time to unions

అదేవిధంగా సమ్మె విరమిస్తే కార్మికుల డిమాండ్లపై రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని రెండు రాష్ర్టాల ప్రభుత్వాలను ఆదేశిస్తామని కార్మిక సంఘాలకు హైకోర్టు భరోసా ఇచ్చింది.

తాము చట్టబద్దంగానే సమ్మె చేస్తున్నామని, నోటీసులు ఇచ్చిన తర్వాతే సమ్మెకు దిగామని కోర్టుకు కార్మిక సంఘాలు చెప్పాయి. ఆర్టీసీ ఆఫీసులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని, సమ్మెను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు తమకు వర్తించవని కార్మికులు తేల్చి చెప్పారు.

సమ్మెపై కేసీఆర్‌కు నివేదిక

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంగళవారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రులు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై సీఎంకు నివేదిక అందజేశారు. కార్మికులకు ఎంత వరకు ఫిట్మెంట్ ఇవ్వొచ్చనే దానిపై కేసీఆర్‌ మంత్రివర్గ ఉపంసంఘం ప్రతిపాదనలు సమర్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+