బనకచర్లను విరమించుకోండి, జగన్ మానస పుత్రిక - ఏబీ సంచలనం..!!

మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ప్రయోజనం లేని బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనను విరిమించువాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ సందర్భంలో బనకచర్ల గురించి ప్రస్తావన చేస్తున్నారు. కేంద్రం, తెలంగాణతో చర్చలకు సిద్దమని వెల్లడించారు. తెలంగాణలోనూ ఈ ప్రాజెక్టు పైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఈ ప్రాజెక్టు పైన ఇప్పుడు ఏబీ వెంకటేశ్వర రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. తెలంగాణ నుంచి అభ్యంతరాలు వస్తున్న వేళ.. వాటి పరిష్కారానికి ముందుకు వచ్చారు. కేంద్రానికి ప్రాజెక్టు గురించి ప్రతిపాదనలు సమర్పించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశం పైన వివరించారు. కాగా, ఇప్పుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి.. ఆలోచనాపరుల వేదిక నేత ఏబీ వెంకటేశ్వర రావు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్టు మాజీ సీఎం జగన్ మానస పుత్రికగా పేర్కొన్నారు. గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపాదన మేరకు దీనికి రూప కల్పన చేసారని చెప్పుకొచ్చారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని విశ్లేషించారు. ఏపీ ప్రజలకు మాత్రమే నష్టమని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

rtd-ips-ab-venkateswara-rao-sensational-analysis-on-banakacharla-project-proposals

వేల కోట్లు ఖర్చు చేసి బనకచర్ల ప్రాజెక్టు నిర్మించటం సమర్థనీయం కాదని విశ్లేషకులు లక్ష్మీ నారాయణ చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలని ఈ వేదిక నుంచి పలువురు ప్రముఖులు తెలిపారు. పోలవరం (గోదావరి) - సోమశిల (పెన్నా)లను అనుసంధానం చేయాలని కోరారు. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని, కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు దీనిని చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి జలాలపై ట్రిబ్యునల్‌ అవార్డు మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1480 టిఎంసిలు వచ్చాయని, వీటి వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విస్పష్టమైన విభజన లేదని, అందువల్ల ఆంధ్ర, తెలంగాణల మధ్య తలెత్తిన ఈ సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించుకోవాల్సి ఉందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+