దేశవ్యాప్తంగా రైల్వే కొత్త నిబంధన

భారతీయుల జీవన విధానంలో రైల్వే అనేది ఒక అంతర్భాగమైంది. ప్రతి మనిషి తన జీవితకాలంలో కచ్చితంగా ఒకసారైనా రైలు ప్రయాణం చేస్తాడు. కొందరు ప్రతిరోజు ప్రయాణిస్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఎంతో అనుకూలంగా ఉండే రైలులో ప్రయాణించడాన్ని ప్రతి భారతీయుడు, భారతీయురాలు ఎంతో సౌకర్యవంతంగా భావిస్తారు. తమ పెంపుడు జంతువులతో ప్రయాణించడానికి సంబంధించి రైల్వే తీసుకొచ్చిన నిబంధనలు తెలుసుకుందాం.

పెంపుడు జంతువులకు వసతి కల్పించడానికి ప్రత్యేకంగా ఒక కంపార్ట్ మెంట్ కేటాయిస్తారు. అయితే ఇది ప్రయాణికుల నుంచి వేరుగా ఉంటుంది. రవాణాలో వాటితో కలిసి ప్రయాణించడం కుదరదు. ఈ ఏర్పాటు ప్రాథమికంగా 3AC, 2AC, 1AC తరగతుల్లో ప్రయాణించే వారికి వర్తిస్తుంది.లగేజ్ కంపార్ట్ మెంట్ లో పెంపుడు జంతువు ప్రయాణించాలంటే రూ.10 నుంచి రూ.30 వరకు టికెట్ ఖర్చు అవుతుంది. ఆ జంతువు పరిమాణంతోపాటు బరువుపై టికెట్ ఎంతవుతుందనేది ఆధారపడివుంటుంది. రాజధాని, శతాబ్ది లాంటి రైళ్లల్లో మరికొంచెం ఎక్కువగా ఉంటుంది.

Rules and regulations for traveling with pets in trains

1AC టికెట్ లో ప్రయాణించేవారు తమ పెంపుడు జంతువుతో ప్రయాణించడానికి రూ.500 టికెట్ ఉంటుంది. అయితే వీరితోపాటు ప్రయాణించే సహ ప్రయాణికులు ఒప్పుకోవాలి. వారు అభ్యంతరం తెలియజేస్తే లగేజ్ కంపార్ట్ మెంట్ లోనే ఉంచాల్సి ఉంటుంది. పార్శిల్ బుకింగ్ కార్యాలయంలో ఆధార్ పాన్ కార్డు వివరాలతోపాటు కుక్కకు వేసిన టీకా సర్టిఫికెట్ ను అందించాల్సి ఉంటుంది. లగేజ్ కంపార్ట్ మెంట్ లో వద్దనుకుంటే అదనపు టికెట్ కొనుగోలు చేయాలి. అప్పుడు మీతోపాటు మీ పెంపుడు జంతువు కూడా కంపార్ట్ మెంట్ ను పంచుకోవచ్చు. పెంపుడు జంతువుతో ప్రయాణించాలనుకునేవారు పార్శిల్ కార్యాలయంలో అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ పొందాలి. అందుకు సంబంధించిన నియమ నిబంధనలు పాటించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+