జయహో బీసీ తరువాత మరో బిగ్ ప్లాన్- వైసీపీ మెగా ఈవెంట్ అనౌన్స్‌మెంట్..!!

అమరావతి: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సామాజిక వర్గాల కోసం అనేక హామీలను ఇచ్చిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- ఇక కార్యాచరణ ప్రణాళికకు దిగింది. జయహో బీసీ పేరుతో గత ఏడాది విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన తరువాత అలాంటి మెగా ఈవెంట్ ను ముస్లింల కోసం నిర్వహించబోతోంది. జయహో ముస్లిం పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.

రాజకీయ భాగస్వామ్యం..

రాజకీయ భాగస్వామ్యం..

చట్టసభలు, స్థానిక సంస్థల్లో ముస్లింలకు చెప్పుకోదగ్గ భాగస్వామ్యం కల్పించింది వైఎస్ఆర్సీపీ. శాసన సభ, శాసన మండలిలో నలుగురు చొప్పున సభ్యులు ఉన్నారు. కడప శాసన సభ్యుడు అంజాద్ భాషా ఉప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ముస్లిం మహిళ జకియా ఖానుమ్.. శాసన మండలి వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తోన్నారు. ముస్లింలల్లో ఒకరు జిల్లా పరిషత్ ఛైర్మన్, ఇద్దరు మేయర్లు, 11 మంది మున్సిపల్ ఛైర్మన్లుగా ఉన్నారు. జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య భారీగా ఉంటుంది.

త్వరలో జయహో ముస్లిం సభ..

త్వరలో జయహో ముస్లిం సభ..

త్వరలో జయహో ముస్లిం సభ నిర్వ‌హిస్తామ‌ని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు ఇక్బాల్, ఇషాక్ బాషా, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఖాదర్ భాషా, లేళ్ళ అప్పిరెడ్డి పాల్గొన్నారు.

అభ్యున్నతి కోసం..

అభ్యున్నతి కోసం..

ముస్లిం మైనారిటీల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు వైఎస్ జగన్ అదే బాటలో నడుస్తున్నారని అన్నారు. ముస్లిం మైనారిటీల రాజకీయ, సామాజిక, ఆర్దిక అభివృద్ధికి దోహదం చేసే అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ముస్లింల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన మరిన్ని చర్యల కోసం చర్చించడానికి త్వరలో జయహో ముస్లిం సభను నిర్వహిస్తామని అన్నారు.

రాష్ట్రస్థాయిలో..

రాష్ట్రస్థాయిలో..

త్వరలో విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ముస్లిం మైనారిటీల సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో చర్చించడానికి అవసరమైన అజెండాను రూపొందించడానికి పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. దీనితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముస్లిం, మైనారిటీల సమావేశాలను ఏర్పాటు చేసి- వారు ఎదుర్కొంటోన్న సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించడానికి ఎమ్మెల్యేలను భాగస్వామ్యులను చేస్తామని అన్నారు.

రూ.20,000 కోట్లు..

రూ.20,000 కోట్లు..

గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా ముస్లిం మైనారిటీల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు కేటాయించిందని ఆ మొత్తాలను నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోకి బదిలీ అయిందని అంజాద్ భాషా అన్నారు. శాసనసభలో, శాసనమండలిలో నలుగురు చొప్పున ముస్లింలకు అవకాశం కల్పించామని చెప్పారు. శాసనమండలి వైస్ ఛైర్మన్ గా ముస్లిం మహిళ జకియా ఖానుమ్ ను అపాయింట్ చేశారని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+