• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకి కొత్త వ్యూహకర్త..!! ప్రశాంత్ కిషోర్ స్థానంలో : నేడు పార్టీ నేతల ముందుకు..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీకి కొత్త రాజకీయ వ్యూహకర్త వచ్చేసారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రశాంత్ కిషోర్ ఆయన టీం పని చేసింది. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఆ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ టీం కీలక సభ్యులతో సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఇక, జాతీయ రాజకీయాల పైన ఫోకస్ పెట్టిన ప్రశాంత్ కిషోర్..తాను ఇక ఏ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా సేవలు అందించనని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ - తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజునే ఆయన తన నిర్ణయం వెల్లడించారు. దీంతో పాటుగా పూర్తిగా బీజేపీ వ్యతిరేక స్టాండ్ తో ప్రశాంత్ కిషోర్ ముందుకు వెళ్తున్నారు.

ప్రశాంత్ కిషోర్ స్థానంలో కొత్తగా..

ప్రశాంత్ కిషోర్ స్థానంలో కొత్తగా..

కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగినా..దానిని విరమించుకొని తన సొంత రాష్ట్రం బిహార్‌లో 'జన్‌ సురాజ్‌' యాత్ర నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. గాంధీ జయంతి నాటి నుంచి పాదయాత్రకు డిసైడ్ అయ్యారు. దీంతో.. ప్రశాంత్ కిషోర్ సేవలు తాము వినియోగించుకోవటం లేదని కొద్ది రోజుల క్రితం పార్టీ సహాలదారు సజ్జల సైతం స్పష్టం చేసారు.

కానీ, థర్డ్ పార్టీ సేవలు వినిగించుకుంటామని స్పష్టం చేసారు. ఇప్పటికే టీడీపీకి రాబిన్ శర్మ రాజకీయ సేవలు అందిస్తున్న క్రమంలో..వైసీపీ కొత్త నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తో పాటుగా ఐ ప్యాక్ సంస్థ సహా వ్యవస్థాపకుడుగా ఉన్న రుషి రాజ్ సింగ్ ను 2024 ఎన్నికల కోసం పార్టీ వ్యూహకర్తగా నియమించుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

పీకే సహ వ్యవస్థాపకుడిగా రుషి

పీకే సహ వ్యవస్థాపకుడిగా రుషి

ఇప్పటికే ఆయన టీం క్షేత్ర స్థాయిలో పని చేసేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. వైసీపీ గడపగపడకు ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రమంలో రుషి సింగ్ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పరిశీలన..అధ్యయనం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు మంత్రులు..సమన్వయకర్తలు..పార్టీల జిల్లాల అధ్యక్షులతో జగన్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశం లో పార్టీ నూతన వ్యాహకర్త రుషిరాజ్ సింగ్ సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. జూలై 8, 9 తేదీల్లో పార్టీ ప్లీనరీ తరువాత సీఎం జగన్ సైతం ఇక ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఈ రోజు జరిగే సమావేవంలో పార్టీ వ్యూహకర్త గురించి వివరించటంతో.. ఆ టీం సేవలు ఏ రకంగా వినియోగించుకోవాలనే దాని పైన ప్రాధమిక చర్చ జరుగుతుందని తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలోనే ప్రశాంత్ కిషోర్ టీం కోర్ సభ్యుడు రుషి రాజ్ తో సీఎం జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ సీఎం అయిత తరువాత రుషి రాజ్ వివాహం జరిగింది.

పార్టీ నేతల ముందుకు వ్యూహకర్త

పార్టీ నేతల ముందుకు వ్యూహకర్త

రుషి వివాహానికి సతీమణి భారతితో కలిసి జగన్ హాజరయ్యారు. 2017లో జరిగిన పార్టీ ప్లీనరీలో ప్రశాంత్ కిషోర్ ను ఓపెన్ గా పార్టీ వేదిక నుంచే జగన్ పార్టీ శ్రేణులకు పరిచయం చేసారు. ఇక, ఇప్పుడు ఎన్నికల కోసం తాను ఎంచుకున్న టీం కు పరిచయం చేస్తారని తెలుస్తోంది. అదే విధంగా ఈ టీం సభ్యులు క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి...ఎమ్మెల్యేల పని తీరు.. పథకాల నిర్వహణ.. ప్రజాభిప్రాయం వంటి వాటి పైన అధ్యయన నివేదికలు పార్టీకి ఇవ్వనున్నట్లుగా సమాచారం.

ఇక, పార్టీ పరంగా అమలు చేయాల్సిన వ్యూహాల పైన సూచనలు చేసే అవకాశం ఉంది. ఇక, ఇప్పుడు వైసీపీకి కొత్త రాజకీయ వ్యూహకర్త ఎంట్రీ..పార్టీ వర్గాల్లో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.

English summary
YSRCP Decided to appoint Rushi Raj Singh political services for Up clming elections in the place of Prasanth Kishor, CM may intoduce him in to day meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X