రైతులకు శుభవార్త: ఏపీలో రేపటి నుండి "రైతన్న మీ కోసం".. చంద్రబాబు ఆదేశం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగ సంక్షేమం కోసం రైతులకు అవగాహన కల్పించడం కోసం మార్చి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు రైతులకు మద్దతుగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ అభివృద్ధికి ఊతమిచ్చే పంచ సూత్రాలతో పాటు అగ్రి టెక్, డీప్ టెక్ ద్వారా సాగు విధానాలపై రైతులకు ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించనున్నారు.
రైతులకు అవగాహనా కార్యక్రమం
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. రైతు సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఏపీలోని రైతులు ఎల్నినో నేపథ్యంలో ముందస్తు అంచనా ప్రకారం ప్రాంతాలవారీగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ అవగాహన కార్యక్రమంలో సూచనలు పొందనున్నారు.

రైతు సేవా కేంద్రం పరిధిలో కార్యక్రమాలు
ప్రతి జిల్లాలోను రైతు సేవా కేంద్రం పరిధిలో వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది, సహకార నీటి సంఘాల సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల ద్వారా రూ.2677 కోట్ల ఆర్థిక సహాయం అందించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
రైతాంగ సంక్షేమానికి ఏపీ సర్కార్ పెద్దపీట
రైతాంగం సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పంటకాలువల్లో పూడిక తొలగింపు పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కాలువలను శుభ్రం చేయించినట్లు పేర్కొన్నారు. దీంతో సాగునీటి సరఫరా మెరుగుపడిందని అన్నారు.
పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి సాగునీరు అందించడం లక్ష్యం
రైతాంగాన్ని ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2027నాటికి పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి సాగునీరు అందించడం ద్వారా రైతాంగానికి మరింత మేలు చేకూరుస్తామని పేర్కొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో నరేగా, అమృత్-2, సీఆర్డీఏ మరియు కార్పొరేషన్ పథకాల కింద కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
ఏడాదికి రైతుకు 20వేల ఆర్ధిక సాయం
గ్లోబల్ ఉద్యాన హబ్, బిందు సేద్యం, కోకో సిటీ, ప్రకృతి వ్యవసాయం వంటి పథకాల ద్వారా రైతులకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద సాగుభూమి మరియు అటవీ భూమి సాగుదారులకు ముందుగానే కిసాన్ సహాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000, పీఎం సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.6,000 అందించడంతో రైతులకు ఏడాదికి మొత్తం రూ.20,000 ఆర్థికసహాయం అందుతుందని చెప్పారు.
రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని సక్సెస్ చెయ్యాలని పిలుపు
ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే 30,500 మంది రైతులకు రూ.60.81 కోట్ల నిధులు అందించినట్లు ఎమ్మెల్యే రామాంజనేయులు వెల్లడించారు. అలాగే గతంలో నిలిచిపోయిన గుంటూరు ఛానల్ పనులను తిరిగి ప్రారంభించి రూ.100 కోట్లతో పొడిగింపు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం, అవగాహన కోసం ప్రారంభం అవుతున్న రైతన్న మీకోసం కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ చెయ్యాలని కోరారు.
-
MRO అధికారాలు, నెల జీతం ఎంతో తెలుసా..? -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!













Click it and Unblock the Notifications