ఏపీ సీఎస్ పై యామిని షాకింగ్ కామెంట్స్ ..పసుపు కుంకుమకు సీఎస్ అడ్డంకులు.. ప్రజలే తరిమికొడతారు
తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను పావుగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం చేతిలో సీఎస్ పావుగా మారారని... పసుపు-కుంకుమ డబ్బు మహిళలు అందకుండా ఎల్వీ సుబ్రమణ్యం కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఇంతవరకు ఇలాంటి సీఎస్ ను చూడలేదని ఆమె అభిప్రాయపడ్డారు . సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ప్రజలే తరిమి కొడతారని యామిని పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడై ఉండి సభ్యత లేకుండా మాట్లాడటం దారుణమన్నారు.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డ ఆమె తిరుమల శ్రీవారి బంగారంపై వైసీపీ రాజకీయాలు చేయడం దారుణమన్నారు.భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని యామిని విమర్శించారు. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని, ఆ పలితాలతో వైసీపీ నేతలకూ ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ యామిని పేర్కొన్నారు .
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications