శాడిస్టు భర్త: తొలి రాత్రే నవవధువుకు నరకం చూపాడు, పరిస్థితి విషమం

Subscribe to Oneindia Telugu

చిత్తూరు: ఎన్నో ఆశలు, ఊసులతో కొత్త దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఓ నవ వధువుకు తొలి రాత్రే చిత్ర హింసలకు గురిచేశాడు ఓ శాడిస్ట్ భర్త. దీంతో తీవ్రగాయాలతో ఆమె ఆస్పత్రిపాలైంది. ఈ దారుణ ఘటన జిల్లాలోని గంగాధర నెల్లూరులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు, టీచర్ అయిన రాజేష్‌కు .. ఎంబీబీఎస్ చదివిన శైలజతో శుక్రవారం ఉదయం కాణిపాకంలో వివాహం జరిగింది. అదేరోజు రాత్రి వారికి కుటుంబసభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. గదిలోకి వెళ్లిన శైలజపై రాజేష్‌ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

 నోట్లో గుడ్డలు కుక్కి..

నోట్లో గుడ్డలు కుక్కి..

మొహంపై పిడిగుద్దులు గుద్ది, నోట్లో గుడ్డలు కుక్కి ఒళ్లంతా కత్తి, బ్లేడుతో గాయాలు చేశారు. బాధకు తాళలేక నవవధువు కేకలు పెట్టి, బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. గది నిండా పగిలిన గాజులు, రక్తపు మరకలు ఉండటం గమనార్హం.

 విషమంగానే శైలజ పరిస్థితి..

విషమంగానే శైలజ పరిస్థితి..

ఒక్కసారిగా భయాందోళనకు గురైన శైలజ తల్లిదండ్రులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

 కోటి రూపాయల కట్నం ఇచ్చి చేస్తే.. వణికిపోతున్న శైలజ

కోటి రూపాయల కట్నం ఇచ్చి చేస్తే.. వణికిపోతున్న శైలజ

కాగా, బి.కోటలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పని చేస్తున్న రాజేష్‌కు.. శైలజ తల్లిదండ్రులు వివాహ సమయంలో సుమారు కోటి రూపాయల కట్నం ఇచ్చినట్లు సమాచారం. తనపై జరిగిన దారుణ ఘటనను తలచుకుని శైలజ భయంతో వణికిపోతోంది. కావాలనే రాజేష్‌ తనపై దాడి ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు ఆమె కన్నీటిపర్యంతమైంది. తనను కొడుతుంటూ తీవ్రంగా అరిచినా అత్తింటివారు తలుపులు తీయలేదని, తన తండ్రి వచ్చి తలుపులు తెరిపించాడని తెలిపింది. సంసారానికి పనికి రాడంటూ తాను ప్రచారం చేసినట్లు ఆరోపిస్తూ తనపై రాజేష్ దాడి చేశాడని, తాను ఎంత చెప్పినా వినిపంచుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకేనా?

లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకేనా?

తనలోని లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకే రాజేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఎంతో సంతోషంగా ఉండాల్సిన తమ కూతురు ఇలా ఆస్పత్రిపాలు కావడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీటిపర్యాంతమయ్యారు. ఉన్నతంగా చదువుకున్న వ్యక్తి ఇలా పైశాచికత్వంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదని వారు వాపోతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A sadist husband harassed wife on first night in Chittoor district on Saturday.ఎన్నో ఆశలు, ఊసులతో కొత్త దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఓ నవ వధువుకు తొలి రాత్రే చిత్ర హింసలకు గురిచేశాడు ఓ శాడిస్ట్ భర్త. దీంతో తీవ్రగాయాలతో ఆమె ఆస్పత్రిపాలైంది. ఈ దారుణ ఘటన జిల్లాలోని గంగాధర నెల్లూరులో చోటు చేసుకుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి