తిరుమ‌ల‌లో నేడు సహస్ర కలశాభిషేకం..సంవ‌త్స‌రానికి ఒక‌సారే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వెల‌సిన ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.. ఇక్క‌డికి నిత్యం భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తుంటారు. తిరుమ‌ల‌లో నేడు స‌హ‌స్ర క‌లశాభిషేకం నిర్వహించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం సంవ‌త్స‌రానికి ఒక‌సారి జ‌రుగుతుంది. ఒక‌రకంగా ఇది తిరుమల శ్రీవారికి ప్రత్యేక అభిషేకంగా చెప్పుకోవాలి. శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరుగనుంది. ఈ సహస్ర కలశాభిషేకాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గత 18 ఏళ్ల నుంచి నిర్వహిస్తోంది.

ఈ సహస్ర కలశాభిషాకానికి ఎంతో విశిష్ట‌త‌ ఉంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ముందుగా స్వామివారికి ఆలయంలోని బంగారు వాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకులు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. సహస్ర కలశాభిషేకం అంటే 1008 పాత్రలు అభిషేక తీర్థంతో నిండి ఉండ‌డం. ప‌ల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించిన‌ట్లు ఇక్క‌డివారు చెబుతున్నారు. దీనికి గుర్తుగా ప్ర‌తి ఏటా ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వెంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన ఉంద‌ని స్థానికులు చెబుతుంటారు.

Sahasra Kalasabhishekam today in Tirumala once in a year

ఒక్క‌రోజు హుండికీ భారీ ఆదాయం...

ఓ ప‌క్క నేడు శ్రీ‌వారికి ప్ర‌త్యేక అభిషేకం జ‌రుగుతుండ‌గా.. మ‌రోప‌క్క కలియుగ ప్రత్యక్షత్ర దైవమైన స్వామివారి ద‌ర్శ‌న భాగ్యం పొందేందుకు తిరుమల కొండపై భక్తుల రద్దీ అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. భ‌క్తుల ర‌ద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. ఇక, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతుంది. నిన్న (జూన్ 15) తిరుమల స్వామివారిని సుమారు 82,886 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్క‌రోజు హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వివ‌రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+