తేజు యాక్సిడెంట్-ఫస్ట్ తెలిసింది బన్నీకే : క్షణాల్లో అప్రమత్తం చేస్తూ- ఆ గోల్డెన్ అవర్ లో : అదే కీలకంగా..!!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పైన అభిమానుల్లో మూడు రోజులుగా ఆందోళన కనిపిస్తోంది. ఆయన పూర్తిగా కోలుకుంటున్నారనే సమాచారంతో వారు ఊరట చెందారు. శుక్రవారం రాత్రి తేజు నడుపుతున్న బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి స్పందించి 108కు సమాచారం ఇచ్చాడు. ఆ తరువాత అతను ఎవరనే విషయం పైన ఆరా తీసారు.

ఆ ఇద్దరూ ఆ సమయంలో కీలక పాత్ర
ఆ వ్యక్తి పేరు అబ్దుల్ అని గుర్తించారు. అతను స్థానికంగా ఒక షాపింగ్ మాల్ లోని వ్యాలెట్ పార్కింగ్ నిర్వహించే వ్యక్తి అని తెలిసింది. దీంతో...ప్రమాద సమయంలో తేజు ఎలా ఉన్నారు..ఏ పరిస్థితుల్లో కనిపించారంటూ అందరూ ఆ వ్యక్తి నుంచి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, అతని సమాచారంతో 108 చేరుకోగానే వెంటనే ఆస్పత్రికి వెళ్లే విధంగా ట్రాఫిక్ క్లియర్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ కు ప్రశంసలు లభిస్తున్నాయి. బాధ్యతగా వ్యవహరించి..తేజు అంబులెన్స్ వెంటనే ఆస్పత్రికి చేరేలా ఆయన సహకరించారు.

ముందుగా తెలిసింది బన్నీకే..
ఇక, తేజును ముందుగా మాదాపూర్ లోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చారు. అదే ఆస్పత్రిలో పని చేస్తున్న స్నేహితుల ద్వారా ముందుగా మెగా ఫ్యామిలీలో సమాచారం అల్లు అర్జున్ కు తెలిసింది. ఆ సమయంలో బన్నీ కాకినాడలో పుష్ప షూటింగ్‌లో ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మెడికవర్‌లో ఉన్న స్నేహితుల ద్వారా ఎప్పటికప్పుడు సాయిధరమ్ ఆరోగ్యం గురించి బన్నీ వాకబు చేశారు.

సమయస్పూర్తిగా స్పందించిన అల్లు అర్జున్
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఎలా ఉంది...ట్రీట్ మెంట్ ఎలా సాగుతుందనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ ఫ్యామిలీ మెంబర్స్ ను అలర్ట్ చేసారు. బన్నీ ఇస్తున్న సమాచారం ఆధారంగా వెంటనే ఆస్పత్రి వద్దకు పవన్ కళ్యాన్.. సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే అపోలోకు చేర్చాలని డిసైడ్ అయ్యారు. వెంటనే ప్రత్యేక అంబులెన్సులో అపోలోకు తరలించారు. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి వరకు బన్నీ..పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమాచారం చిరంజీవి అందిస్తూ..ఆయన సూచనల మేరకు అపోలోకు చేర్చే విధంగా సూచనలు చేసారు.

కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్
ఇక, అపోలోలో ఆదివారం సాయి ధరమ్ తేజ్ కు చేసిన కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయింది. తేజు పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు స్పష్టం చేసారు. 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతామని చెప్పారు. చిరంజీవి- సురేఖ దంపతులు, అదే విధంగా రాం చరన్- ఉపాసనతో పాటుగా పలువురు సినీ సెలబ్రెటీలు సైతం అపోలోకు వచ్చి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం పైన వాకబు చేసారు. ఇక, ఇదే సమయంలో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం కేసును సుమోటోగా స్వీకరించి రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
Recommended Video

ఇక ప్రమాదం పైన పోలీసుల విచారణ
ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. తేజ్‌పై ఐపీసీ 336, 279, మోటార్ వాహన చట్టం 184 కింద కేసు నమోదు చేశారు. ఆ రోజు రాత్రి సుమారు 8.20 గంటలకు ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు అబ్దుల్ ఫరాన్, ఆసీఫ్‌లను పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా బైక్ వేగాన్ని అంచనా వేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతం నుంచి వెనక్కి వెళ్తూ, అతను బయల్ధేరిన ప్రాంతం వరకు ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాల్లో సాయిధరమ్‌తేజ్ బైక్‌పై వస్తున్న దృశ్యాలు నమోదయ్యాయో సేకరిస్తున్నట్లు సమాచారం.
ఏ ప్రాంతంలో ఎంత స్పీడ్‌తో వెళ్లాలి, ఆయన ఎంత స్పీడ్‌తో వెళ్లారు అనే అంశాలపై టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో రోడ్డుపై ఇసుక ఉండటంతో టీఎస్ఐఐసి (ఐలా) అధికారులకు కూడా నోటీసులు ఇవ్వడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత ప్రమాదం పైన పోలీసులు తేజును సైతం విచారించే అవకాశం ఉంది. అయితే, సాయి ధరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications