విభజన: అధిష్టానంపై ధ్వజమెత్తిన సాయిప్రతాప్

Sai Pratap
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయం విషయంలో తమ పార్టీ అధిష్టానంపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన బుధవారంనాడు అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకే ఢిల్లీ పెద్దలు కంకణం కట్టుకున్నట్లు కనపడుతోందని, వీరప్పమొయిలీ నుంచి ఆజాద్, దిగ్విజయ్ సింగ్ వరకు రాష్ట్రంలో పార్టీని అధోగతి పాలు చేశారని అన్నారు.

ఇందిరా, రాజీవ్, సోనియా గాంధీ పేర్లు చెప్పి ఓట్లు అడిగేవాళ్లమని, ఇప్పుడు ఎవరి పేరు చెప్పి అడగాలని ఆయన అన్నారు. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే పద్ధతిలో అధిష్టానం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర నాయకులకు అధిష్టానం పట్ల విధేయత నరనరాన జీర్ణించుకుని పోయిందని, తామేం చేసినా తలాడిస్తారనే ధీమా ఢిల్లీ మాటల పెద్దల మాటల్లో వ్యక్తమవుతోందని ఆయన అన్నారు.

ఢిల్లీలోని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సోనియా గాంధీని తప్పుదారి పట్టించారని, రాష్ట్రంలో పార్టీని భూస్థాపితం చేశారని ఆయన అన్నారు. తాను ఎనిమిది సార్లు లోకసభకు పోటీ చేశానని, పార్టీకి విధేయుడిని అని, ఆరు సార్లు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల ఫొటోలు పెట్టుకుని గెలిచానని, ఇప్పుడ ఎవరి ఫొటో పెట్టుకుని జనాల్లోకి వెళ్లాలని ఆయన అన్నారు

తమ రాజకీయ భవిష్యత్తు గురించి పట్టించుకునేవాళ్లు లేరని, తమను ఓ మూలకు నెట్టారని, తమ భవిష్యత్తు కోసం తాము నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని వాళ్లే కల్పించారని ఆయన అన్నారు. ఇప్పటికే రాజీనామాలు చేసిన ఎంపీలందరం వాటిని ఆమోదింపజేసుకుంటామని, ఇందులో మార్పేమీ లేదని ఆయన అన్నారు.

తెలంగాణ ఇస్తే చాలనే అభిప్రాయం అధిష్టానంలో కనిపిస్తోందని, నిజానికి తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదని, తెలంగాణ రాష్ట్ర సాధన క్రెడిట్‌ను తెరాస తన ఖాతాలో వేసుకుంటుందని ఆయన అన్నారు. తమ లాంటి సీనియర్ నేతల అభిప్రాయాలకు విలువ లేదని, మౌనంగా ఉంటామని అనుకుంటున్నారని ఆయన అన్నారు. తమకు నోళ్లు లేవని, చెప్పిన మాట తూచ తప్పకుండా వింటామనే భావనతో ఉన్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+