శ్రీశైలం మాకిస్తారా: సాయిప్రతాప్, వరుసగా ఎంపీల రిజైన్

రాష్ట్ర విభజన జరిగితే సీమ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని, ఆ విషయమై ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ అభిప్రాయమన్నారు.
సీమాంధ్రులు దోచుకున్నారని అంటున్న వారు రెండు నెలలుగా రోడ్ల పైకి వస్తున్న ప్రజలను చూడాలన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. ప్రజల ఆందోళనల్లో భాగస్వామ్యం కావాలన్నదే తమ ఆలోచన అన్నారు. తమ రాజీనామాలు ఆలోచిస్తే ఆనందిస్తామన్నారు. ప్రజలు లేకుంటే ప్రభుత్వాలు లేవని తెలుసుకోవాలన్నారు. విభజన ప్రక్రియ రాజకీయంగా వెనక్కి పోతుందన్నారు.
ఎంపీల రాజీనామా
నలుగురు ఎంపీలు సోమవారం మరోసారి రాజీనామాలు సమర్పించారు. లగడపాటి రాజగోపాల్ (విజయవాడ), ఉండవల్లి అరుణ్ కుమార్ (రాజమండ్రి), సబ్బం హరి (అనకాపల్లి), సాయి ప్రతాప్ (రాజంపేట)లు రాజీనామా సమర్పించారు.












Click it and Unblock the Notifications