వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొట్టంబాబుకు గొటబాయ గతే..నవసందేహాలు తీరి నవరంధ్రాలు మూతపడినట్టే: పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాలలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పాలని తాపత్రయ పడుతూ టీడీపీ, టిడిపి అసమర్థతను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ వైసిపి నిత్యం ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్నారు. ఇక రెండు పార్టీ నేతల మధ్య జరుగుతున్న మాటల సమరంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం టిడిపి నేతలు ఎందరో ఉమ్మడిగా దాడి చేసిన సింగిల్ గా అందరు నేతలకు సమాధానం చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబును, లోకేష్ ను, టిడిపి నేతలను, పవన్ కళ్యాణ్ ని సైతం టార్గెట్ చేస్తూ సాయి రెడ్డి సెటైర్లు వేస్తున్నారు.

వెన్నుపోటు చంద్రంలా మభ్యపెట్టే ప్రకటనలు ఉండవు

వెన్నుపోటు చంద్రంలా మభ్యపెట్టే ప్రకటనలు ఉండవు

తాజాగా విజయసాయిరెడ్డి రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఈనెల 20న సీఎం జగన్ గారు భూమిపూజ చేయనున్నారు అని ప్రకటన చేశారు. అభివృద్ధికి నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మణిహారం కాబోతున్నాయి. ఉదయగిరిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ రాబోతుందని పేర్కొన్నారు. "వెన్నుపోటు"చంద్రంలా మభ్యపెట్టే ప్రకటనలు, చిత్తశుద్ధిలేని శంకుస్థాపనలు ఈ ప్రభుత్వంలో ఉండవని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.

 పాతాళానికి చేరిన చంద్రబాబు గ్రాఫ్ పెంచలేకే ఫేక్ సర్వేలు

పాతాళానికి చేరిన చంద్రబాబు గ్రాఫ్ పెంచలేకే ఫేక్ సర్వేలు

అంతేకాదు జగన్ ప్రజాదరణ చూసి చంద్రబాబు, పచ్చ కుల మీడియా వెన్నులో వణుకు పుట్టి ఢిల్లీలో టీడీపీ జీతగాళ్లతో ఫేక్ సర్వేలు చేయించి జనం మీదకు వదులుతున్నారు అంటే విమర్శలు గుప్పించారు విజయసాయి . పాతాళానికి చేరిన చంద్రబాబు గ్రాఫ్ పెంచలేకే ఫేక్ సర్వేలు మొదలెట్టారని తేల్చి చెప్పారు. పీకేసిన సీఎంకి మూడో స్థానమిచ్చినప్పుడే మీ స్థాయేంటో అర్ధమైందర్రా అంటూ మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే కు మూడవ స్థానం ఇచ్చినప్పుడే మీ స్థాయి అర్థమయింది అని సెటైర్లు వేశారు.

 గొట బాయ రాజపక్సతో చంద్రబాబును పోల్చిన విజయసాయిరెడ్డి

గొట బాయ రాజపక్సతో చంద్రబాబును పోల్చిన విజయసాయిరెడ్డి

ఇక ఇదే సమయంలో పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొట బాయ రాజపక్సతో చంద్రబాబును పోల్చిన విజయసాయిరెడ్డి, ఏపీలో ప్రజలు చంద్రబాబును ఆదరించక పోతే ఇక్కడ తేడా వస్తే సింగపూర్ పారిపోవడానికి చాన్నాళ్ల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేసి - అక్కడ ఓ హోటల్ కొనుక్కున్నాడు అంటూ ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు ఒక ప్రైవేట్ జెట్ రెడీగా పెట్టుకున్నాడని విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయిలా 2024 తర్వాత ఈ 'గొట్టం బాబు'కీ అదే పరిస్థితి వస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇద్దరిదీ చివరి మజిలీ సింగపూరే అంటూ సెటైర్లు వేశారు సాయి రెడ్డి.

చంద్రబాబు ఉంటే వరదలను కంట్రోల్ చేసినట్టు బిల్డప్ లు

చంద్రబాబు ఉంటే వరదలను కంట్రోల్ చేసినట్టు బిల్డప్ లు

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటెత్తుతున్న వరదల నేపద్యంలో చంద్రబాబు ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఈ సమయంలో చంద్రబాబు ఉంటే వరదలను కంట్రోల్ చేసినట్టుగా బిల్డప్ ఇచ్చేవాడని, అధికారం పని చేసుకోనివ్వకుండా రచ్చ చేసేవాడని విమర్శించారు. ప్రజలు శని వదిలించుకున్నారు గానీ...ఈ వరదల టైములో మెంటల్ బాబ్జీ ఉంటే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తిష్టవేసి గంటగంటకు వాటర్ లెవల్ కొలిచేవాడని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. అధికారులకు మందలింపులు, ఫ్లడ్ మాన్యువల్ చదవాలని హెచ్చరికలు జారీ చేసే వాడిని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

చంద్రం ఏం చేసినా పచ్చ కుల మీడియాకు అది చాణక్యమే!

చంద్రం ఏం చేసినా పచ్చ కుల మీడియాకు అది చాణక్యమే!

ఇక ఇదే సమయంలో ద్రౌపది ముర్ము చంద్రబాబు ఆత్మీయ సమావేశం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి చంద్రం ఏం చేసినా పచ్చ కుల మీడియాకు అది చాణక్యమే! అంటూ ఎద్దేవా చేశారు ఎందరి కాళ్లు పట్టుకున్నదీ, ఎంత లాబీయింగ్ చేసిందీ అందరికీ తెలుసు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పొర్లుదండాలు పెట్టి ప్రాధేయపడ్డాడు కాబట్టే ద్రౌపది ముర్ము గారు మర్యాద పాటించారు. కొన్నాళ్ల తర్వాత ఆమె పేరు ప్రతిపాదించింది నేనే అని కథలు మొదలెడతాడు చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు.

విపక్ష నేతలకు కడుపుమంట అందుకే

విపక్ష నేతలకు కడుపుమంట అందుకే

పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు విజయసాయిరెడ్డి. నవరత్నాలపై ప్రజల్లో సంతృప్తి ఉందని నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించిన పేర్కొన్నారు. గ్రామ, వార్డ్ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గడప గడపకు పౌరసేవలు అందుతున్నాయి కాబట్టే విపక్ష నేతలకు కడుపుమంట అంటూ విమర్శించారు. ఇక నవసందేహాలు తీరి నవరంధ్రాలు మూతపడ్డట్టే అంటూ ఇటీవల నవరత్నాల పై నవ సందేహాలు అంటూ పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.

English summary
Sai Reddy is targeting TDP chief Chandrababu, Lokesh, TDP leaders and Pawan Kalyan as well. sai reddy compares chandrababu with gotabaya rajapaksa and slams pawan kalyan over navaratnalu comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X