శైలజానాథ్ విదేశీ వైద్యం: ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు

మాజీ మంత్రి శైలజానాథ్ విదేశీ వైద్య ఖర్చుల అంశాన్ని ఎలా సమర్థించుకుంటారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
విదేశాల్లో అందించిన వైద్యం మన దేశంలో అందుబాటులో లేదా అంటూ హైకోర్టు ధర్మాసనం సందేహాన్ని వ్యక్తం చేసింది. విలువైన ప్రజాధనాన్ని ఓ మంత్రి విదేశాల్లో వైద్యం చేయించుకునేందుకు వినియోగించడం ఎంతవరకు సమర్థనీయమో తెలియజేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి సూచించింది.












Click it and Unblock the Notifications