రాజీనామాలతో విభజనకు జగన్ కుట్ర: శైలజానాథ్

రాజీనామాలు చేయవద్దని ఆయన సీమాంధ్ర శాసనసభ్యులకు విజ్జప్తి చేశారు. రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులు చూడడం అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ తీర్మానం శాసనసభలో ఆమోదం పొందే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.
వైయస్సార్ కాంగ్రెసు పా్రటీతో కాంగ్రెసు అధిష్టానం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజం కాకూడదని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే రాజీనామాలు చేయకుండా తెలంగాణ తీర్మానం శాసనసభకు వచ్చినప్పుడు మాట్లాడాలని, తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహారం కుట్రపూరితంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యవాదులుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications