అప్పులు తెచ్చి అమరావతిలో ఖర్చు..!!

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి పైన వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతి నిర్మాణం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తాజాగా ప్రధాని మోదీ అమరావతిలో పనులను రీ లాంఛ్ చేసారు. మూడేళ్ల కాలంలో రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఫ్యూచర్ సిటీగా అమరావతిని తీర్చి దిద్దుతామని స్పష్టం చేసారు. కాగా, ప్రభుత్వం అప్పులు చేసి ఆ మొత్తాన్ని అమరావతికే పరిమితం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది.

ఆంధ్రా అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి శైలజా నాధ్ వ్యాఖ్యా నించారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన, ఇది ఖచ్చితంగా వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెట్టడమేనని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతమైన అమరా వతికి కృష్ణా నది ముంపు ప్రమాదం ఉందని చెప్పారు. నిజంగా ఆ భయం లేకపోతే దాదాపు రూ. 1100 కోట్లతో ఐదు ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. ఆ 5 లిప్టు స్కీమ్ ‌లు చేపట్టకపోతే, అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు హెచ్చరించాయని చెప్పుకొచ్చారు.

sailajanath-questioned-on-expenditure-for-amaravati

దేశంలో జాతీయ రహదారులను కిలోమీటరుకు రూ.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తుంటే, రాజధాని అమరావతిలో మాత్రం కిలోమీటర్‌ రోడ్డుకు ఏకంగా రూ.59 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేసారు. పైగా ఆ పనుల కాంట్రాక్టులన్నీ టెండర్లు లేకుండా నామినేషన్‌ పద్ధతిలో తమ వారికే కట్టబెడుతున్నాడని విమర్శించారు. ఏడేళ్ల కిందట అమరావతిలో ఐకానిక్‌ టవర్లు, ఆకాశహర్ మ్యాలు, సీ ప్లేన్, నది మీద హ్యాంగింగ్‌ బ్రిడ్జి అంటూ గ్రాఫిక్స్‌తో ప్రచారం చేసి ఊదరగొట్టారని గుర్తు చేసారు. ఐదేళ్లు గడిచాక చూస్తే అమరావతిలో తాత్కాలిక హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ తప్ప వేరే నిర్మాణాలు కనిపించలేదన్నారు. అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన 34 వేల ఎకరాల భూమిని బీడు పెట్టేశారని చెప్పుకొచ్చారు. 11 నెలల్లో రూ.1.50 లక్షల కోట్లు అప్ పులు చేసిన చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు.
అమరావతి అంచనా వ్యయాన్ని ఏకంగారూ. 44 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచేశా రని శైలజానాధ్ విమర్శించారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+