హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూటి ఒప్పుకోం: శైలజ, విషయం పక్కదారి: నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా తాము అంగీకరించమని మంత్రి శైలజానాథ్ మంగళవారం అన్నారు. తాము సమైక్యానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు అందరు సమైక్యానికే కట్టుబడి ఉన్నారని చెప్పారు.

అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. తమ పార్టీ విప్ జారీ చేసినా తాము దానిని ధిక్కరించి విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని శైలజానాథ్ చెప్పారు. తాము సమైక్యానికే కట్టుబడి ఉన్నామని, అలాంటప్పుడు హైదరాబాద్ యూటి చర్చే లేదన్నారు.

షిండేతో కోట్ల భేటీ

కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు.

సీట్లు పెంచాలని కోరాం: మర్రి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అసెంబ్లీ సీట్లు పెంచాలని తాము షిండేను కోరినట్లు సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. మర్రి ఆధ్వర్యంలో పలువురు తెలంగాణ నేతలు షిండేను కలిసి అసెంబ్లీ సీట్లను తెలంగాణలో 119 నుండి 153కు పెంచాలని కోరారు.

పక్కదారి పట్టించేందుకే: నారాయణ

రాయల తెలంగాణ తమ పార్టీ అజెండా కాదని, అసలు విషయం పక్కదారి పట్టించేందుకే రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వేరుగా అన్నారు. విభజన విషయంలో కొత్త సమస్యలు సృష్టించవద్దని తాము మంత్రుల బృందాన్ని కోరినట్లు చెప్పారు. రాయల తెలంగాణ పైన తమను ఐబి సంప్రదించలేదన్నారు.

English summary
State Minister Sailajanath has opposed the reported proposal by the central government to make Hyderabad a union territory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X